• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ విధంగా '2 పాయింట్ ఓ'కు...

ఆ విధంగా '2 పాయింట్ ఓ'కు దెబ్బేశాడు

By - Tupaki Desk
Update: 2018-01-01 05:41 GMT
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇక మరో మూడు నెలల్లో రాబోయే సమ్మర్ కోసం ఇప్పటినుండి ఫిలిం లవర్స్ అందరూ పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ సమ్మర్లో తెలుగు సినిమాల విషయంలో ఢోకా లేదు కాని.. డబ్బింగ్ క్యాటగిరీలో వచ్చే సూపర్ స్టార్ '2 పాయింట్ ఓ' మాత్రం మన సినిమాల డేట్లను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక టాలీవుడ్ లో ఈ సినిమా తాలూకు ప్రభావం పక్కన పెడితే.. అసలు కోలీవుడ్ లో ఈ సినిమాకు డిఫరెంట్ ఫ్యూచర్ ఉండే ఛాన్సుందని అంటున్నారు విశ్లేషకులు. పదండి చూద్దాం.

ఒక రకంగా శంకర్ డైరక్షన్ లో రూపొందిన ఈ 200 కోట్ల రూపాయల సైన్స్ ఫిక్షన్ సినిమాకు దెబ్బేసింది రజనీకాంత్ అంటారా? అని అడిగితే.. అవుననే చెబుతున్నారు సినిమా పండితులు. దానికి కారణం.. ఆయన పార్టీ పెడుతున్నాను అంటూ ప్రకటించడం. విషయం ఏంటంటే.. రజినీకి ఊర మాస్ ఫ్యాన్స్ ఎక్కువ. బి అండ్ సి సెంటర్లన్నీ ఆయనకు ఫిదా. అయితే ఆ సెంటర్లలోనే ఎక్కువగా చాలామంది ఏఐడింఎంకె మరియు డిఎంకె పార్టీల వర్గీయులు ఉన్నారు. సౌత్ చెన్నయ్ - కొయంబత్తూరు - మధురై వంటి ముఖ్యమైన రాజకీయా స్థావరాలన్నీ ఈ పార్టీలు పంచుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీల్లోని రజినీ అభిమానులు.. ఈయన పెట్టబోయే కొత్తపార్టీకి సపోర్టు ఇద్దాం అనుకుంటే పర్లేదు.. అలా కాకుండా ఆయన మీద హర్ట్ అయితే మాత్రం.. ఆ ప్రభావం సినిమా రిజల్ట్ మీద పడకమానదు. వారందరూ మూకుమ్మడిగా చూడ్డం మానేస్తే.. అసలుకే మోసం వస్తుంది.

ఆల్రెడీ రజినీ ఇలా పార్టీ పెడతా అన్నాడో లేదో.. అక్కడ అలా ఆయనపై చురకలు వేయడం మొదలెట్టేశారు జనాలు. ఆయన రాజకీయాలకు పనికిరాడని ఒకరు.. అబ్బే ఇదంతా జస్ట్ హంగామా అని మరొక పార్టీవారు కామెంట్లు చేశారు. ఈ సమయంలో 2 పాయింట్ ఓ సినిమా రిజల్ట్ రాజకీయాలకు అతీతంగా ఉండబోతుందా? ఉంటుందా? అనేది చూడాల్సిన విషయమే గురూ.
Tags:    
  • Rajinikanth 
  • Political Entry 
  • Robo 2.0 Movie 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS