ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన అమ్మాయితో రజినీకాంత్‌ ప్రేమ - ఆమె గుండు!

Update: 2021-08-17 00:30 GMT
తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ మరియు ఆయన భార్య లతలు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కూడా ప్రతి సందర్బంలో అందమైన జంటగా అభిమానులకు కన్నుల వింధు చేస్తు ఉంటారు. బస్సు కండక్టర్ అయిన రజినీకాంత్‌ సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కి ముందు ఓ లవ్ స్టోరీ కూడా వీరి మద్య జరిగింది. రజినీకాంత్ అంటే లతకు ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లుగా అభిమానం. తమిళ నటుడు వైజి మహేంద్రన్‌ భార్య చెల్లెలు ఈ లత. తన బావ గారి ద్వారా రజినీకాంత్‌ ను కలిసే అవకాశంను లత దక్కించుకున్నారు. కాలేజ్ చేస్తున్న సమయంలోనే రజినీకాంత్‌ ఇంటర్వ్యూ కోసం అన్నట్లుగా ఆయన్ను కలిసే అవకాశంను లత దక్కించుకున్నారు.

లతను మొదటి సారి చూసిన సమయంలో రజినీకాంత్‌ కూడా ప్రేమలో పడ్డాడు. ఆమెను చూసిన వెంటనే ఫిదా అయిన రజినీకాంత్‌ ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పాడట. ఆమె అంతకు మించిన అదృష్టం ఏం ఉంటుంది అన్నట్లుగా వెంటనే ఓకే చెప్పిందట. ఇద్దరి మద్య మూడు రోజుల వరకు కలయిక లేదు.. మాటలు లేదు. మూడు రోజుల తర్వాత రజినీకాంత్‌ ముందుకు లత వచ్చారు. ఆ సమయంలో లత ను చూసిన రజినీకాంత్‌ షాక్‌ అయ్యారట. ఎందుకంటే ఆ సమయంలో లత గారు గుండు చేయించుకుని ఉన్నారు. అంతకు ముందు చూసిన సమయంలో లత ఎక్కువ జుట్టుతో కనిపించారు. కాని ఆ సమయంలో గుండుతో చూసేప్పటికి షాకింగ్‌ గా అనిపించింది.

గుండును ఎందుకు చేయించుకున్నావు అంటూ ప్రశ్నించిన సమయంలో.. మీరు అంటే నాకు ప్రాణం.. మీరు నాపై ఉన్న ప్రేమను మార్చుకోకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుని గుండు చేయించుకున్నాను అంటూ చెప్పిందట. ఆమె చెప్పిన మాటకు రజినీకాంత్‌ షాక్ అయ్యాడు. ఆమె తన కోసం అంతగా త్యాగం చేసిన విషయంను రజినీకాంత్‌ జీవితాంతం మర్చి పోడు. రజినీకాంత్‌ భార్య జుట్టు పెప్పుడు కూడా పొట్టిగానే ఉంటుంది. దానికి కారణం ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేదు. కాని పెళ్లికి ముందు రజినీకాంత్ కోసం ఆమె గుండు చేయించుకున్న విషయం మాత్రం వాస్తవం. పలు తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఆ విషయాలు వచ్చాయి.
Tags:    

Similar News