MH 01 BR 1956.. దీని కథేంటంటే..

Update: 2017-05-26 06:47 GMT
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'కాలా' ఫస్ట్ లుక్ వచ్చింది. ఆయన కూర్చున్న ఫోజ్ చెబుతుంది అది ఏంటో ఎలా ఉండబోతుందో. కబాలిని డైరెక్ట్ చేసిన  పా రంజితే కాలా ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే సదరు పోస్టర్ ను చూస్తుంటే.. అసలు ఈ సినిమా గురించి చాలానే చెప్పుకోవచ్చు మనం. పదండి చూద్దాం.

జీపు మీద కూర్చొని డాన్ లా కనిపిస్తున్న రజిని ఈ సినిమాలో ఒక మాఫియా లీడర్ పాత్ర చేస్తున్నారని ఇప్పటికే టాక్. అక్కడ కూర్చున్న జీప్ నెంబర్ MH 01 BR 1956 అని ఉంది చూశారూ.. దాని ద్వారా మనం చాలానే డీకోడ్ చేసుకోవచ్చు. MH అంటే మహారాష్ట్ర అని అర్ధమవుతోంది. ఇక దేశంలోనే గొప్ప బిజినెస్ రాష్ట్రాలుగా పేరు పొందిన గుజరాత్, మహారాష్ట్ర ఒకప్పుడు కలిసుండేవి. 1956లో అవి చీలిపోయాయి. అదే ఏడాది బి.ఆర్.అంబేద్కర్ కూడా చనిపోయారు. చూస్తుంటే BR.. 1956.. అందుకే చిహ్నాలుగా లేవూ? అందుకే ఈ సినిమా ఖచ్చితంగా అప్పటి రాజకీయాల పైన బిజినెస్ పెత్తందారులు పైన ఏమైనా ఉద్రేకపూరిత సన్నివేశాలతో ఉండొచ్చని ఒక టాక్. లేదంటే ఇది మహారాష్ట్ర లో తమిళ్ ప్రజలు కోసం ఒక వ్యక్తి పోరాటంగా చెప్పవచ్చా?

ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన నవల ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తంగా ఒక క్లాసిక్ అయ్యింది. మత ఘర్షణలు, కుట్ర రాజకీయాలు మధ్య నలిగే సామాన్య జీవితాలు కోసం  మరీ మన కాలా ఎలా పోరాడుతాడు అనేది చూడాలి. బ్యాక్ డ్రాప్ అదే అని మనకు చెప్పక పోయాన MH 01 BR 1956 బట్టి కొంత గెస్ చేయవచ్చు. రజిని ఇంతకు ముందు బాషాలో కూడా ముంబాయ్ డాన్ గా కనిపించారు. ఇప్పుడు మళ్ళీ కాలా గా ఎలా ఆడిస్తారు అనేది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News