• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గేర్ మార్చిన రజనీ .. జెట్...

గేర్ మార్చిన రజనీ .. జెట్ స్పీడ్ షురూ!

By - Tupaki Desk
Update: 2021-01-12 08:19 GMT
తమిళనాట రజనీకాంత్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన ఒక భాషలో ఒక సినిమా చేస్తున్నాడూ అంటే, దాదాపు ఓ అరడజను భాషల్లో ఏక కాలంలో సినిమా చేస్తున్నట్టుగానే అనుకోవాలి. ఎందుకంటే ఆయన చేసే ఆ ఒక్క సినిమా మిగతా భాషల్లోను విడుదలవుతుంది .. విజయవిహారం చేస్తుంది. రజనీకి తమిళనాడులో ఎంతటి మార్కెట్ ఉందో, మిగతా ప్రాంతాల్లోను కాస్తంత అటూ ఇటుగా అంతే మార్కెట్ ఉంది. అందువలన ఆయన సినిమాలు తీయడంలోను పోటీ ఉంటుంది .. ఆ సినిమాలను కొనడంలోను పోటీ ఉంటుంది. ఇక ఆ సినిమాలను చూడటంలో పోటీ ఎలాగూ ఉంటుంది.


ఇతర హీరోలు తెరపై చేసే కొన్ని విన్యాసాలు చూస్తే అతిగా అనిపిస్తాయి. అదే రజనీ చేస్తే ప్రేక్షకులు వాటిని అంగీకరిస్తారు. అందుకు కారణం .. అవి ఆయన స్టైల్ కి లింకై ఉండటమే. అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన సినిమాలవైపు వస్తారో .. లేదోననే ఉద్దేశంతో, ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. అందువల్లనే ఆయన నుంచి కొత్త దర్శకుల సినిమాలు కూడా వచ్చాయి. రజనీ మార్కుతోనే భారీ వసూళ్లను సాధించాయి .. కొత్త రికార్డులను సృష్టించాయి.


అలాంటి రజనీకాంత్ .. ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఇటీవల స్పష్టం చేశారు. ఇకపై సినిమాలపైనే తన పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఇప్పుడు కూడా దర్శక నిర్మాతల మధ్య మళ్లీ పోటీ మొదలైంది. ఆయనతో సినిమాలు చేయడానికి వాళ్లంతా ఉత్సాహ పడిపోతున్నారు. రజనీకాంత్ కి సూపర్ హిట్లు ఇచ్చిన సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ .. 'చంద్రముఖి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పి.వాసు మొదలు, 'కబాలి' దర్శకుడు పా.రంజిత్, .. 'పేట' డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ .. వీళ్లంతా కూడా రజనీకి కొత్త కథలు వినిపిస్తున్నారనేది కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' చేస్తున్న రజనీకాంత్, ఆ తరువాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి మరి.      
Tags:    
  • Rajinikanth political Party 
  • Rajinikanth Movie Shooting 
  • Rajinikanth Movie Updates 
  • Kollywood Movies 
  • Kollywood Shootings 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS