• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగపతి బాబు కాదు.....

జగపతి బాబు కాదు.. రాజేంద్ర ప్రసాద్

By - Tupaki Desk
Update: 2015-09-22 11:30 GMT
అవార్డులంటే ఎవరికి చేదు చెప్పండి. ఎంత సింపుల్ గా బతికే వాళ్లయినా ప్రభుత్వం నుంచి ఓ గుర్తింపు సంపాదించాలని.. ఓ అవార్డు అందుకోవాలని ఆశించడం సహజం. సినిమా వాళ్లకు కూడా ఆ ఆశ చాలానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించబోయే సమయానికి టాలీవుడ్ జనాలు చాలామంది ఆశగా చూస్తారు. మంచి పలుకుబడి ఉండి.. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం గట్టిగా సిఫారసు చేస్తే.. పద్మ పురస్కారం ఒళ్లో వాలిపోతుంది.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ ప్రముఖులపై బాగానే దృష్టిపెట్టింది. మొత్తంగా నలుగురిని పద్మ పురస్కారాలకు సిఫారసు చేసింది. నటుడిగా నాలుగు దశాబ్దాల అనుభవమున్న మురళీ మోహన్ అనుకున్నట్లే పద్మభూషణ్ రేసులో నిలిచారు. ఆయన ప్రస్తుతం ఎంపీ కూడా అన్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ రంగాల్లో తాను అందించిన సేవలకు ఆయన పురస్కారం ఆశిస్తున్నారు.

పద్మశ్రీ కోసం ముగ్గురి పేర్లను  సిఫారసు చేసింది ఏపీ సర్కారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ - గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి - సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ రేసులో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై తన స్టేటస్ పెంచుకున్నారు. ఐతే తెలుగుదేశం ఎంపీ అయిన మురళీ మోహన్ కు వ్యతిరేకంగా ఆయన గెలుపొందిన నేపథ్యంలో అవార్డు వస్తుందో రాదో చూడాలి.

వేటూరి సుందరరామ్మూర్తి లాంటి పెద్దాయనకు ఎప్పుడో పురస్కారం దక్కాల్సింది. ఇప్పటికైనా ఆయన పేరును ప్రతిపాదించినందుకు సంతోషం. వందేమాతరం కూడా అవార్డుకు అర్హుడే. ఐతే మరో సీనియర్ నటుడు జగపతి బాబు పద్మశ్రీ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన పేరు జాబితాలో లేదు. జగపతి కంటే రాజేంద్ర ప్రసాదే సీనియర్ అని భావించిన ఆయన పేరు జాబితాకు ఎక్కించినట్లున్నారు.
Tags:    
  • Rajendra Prasad 
  • Jagapathi Babu 
  • Padma Awards 
  • telugu NEWs 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS