'జోసెఫ్‌' అనే క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌

Update: 2020-12-09 14:30 GMT
ఈ ఏడాది ఆరంభం నుండి రాజశేఖర్‌ మరియు నీలకంఠల కాంబినేషన్‌ లో ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కరోనా వచ్చింది. కరోనా కారణంగా ఆరు ఏడు నెలలు షూటింగ్‌ లు అన్ని కూడా బంద్‌ అయ్యాయి. ఎట్టకేలకు షూటింగ్‌ లు ప్రారంభం అయినా కూడా రాజశేఖర్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడం వల్ల సినిమా షూటింగ్‌ మళ్లీ ఆలస్యం అయ్యింది. వచ్చే ఏడాది వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది అంటున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమా మలయాళ మూవీకి రీమేక్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళంలో వచ్చిన 'జోసెఫ్‌' అనే క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ మూవీని నీలకంఠ రీమేక్‌ చేస్తున్నాడు. జోజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. అతడి నటనకు అవార్డులు రివార్డులు వచ్చాయి. ఒక సింపుల్‌ పాత్రలో కనిపించిన అతడు సహజత్వంతో కనిపించాడు. ఆ పాత్రను ఇప్పుడు రాజశేఖర్‌ పోషించబోతున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్లుగా దర్శకుడి సన్నిహితులు చెబుతున్నారు. అతి త్వరలోనే సినిమా గురించిన మరిన్ని విషయాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది. కరోనాను జయించిన రాజశేఖర్‌ త్వరలో పూర్తి స్థాయి ఆరోగ్యంతో షూటింగ్‌ లో జాయిన్‌ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Tags:    

Similar News