దర్శకనిర్మాతలు పట్టించుకోని తెలుగు అందాలు.. వీరేనా..?

Update: 2020-04-30 01:30 GMT
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఒకరు ఎంట్రీ ఇవ్వనేలేదు.. ఇంకొకరు నిలబడనే లేదు. టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూతుర్లకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్. డాక్టర్స్ కమ్ యాక్ట్రెస్ గా రాజశేఖర్ కూతుళ్లు ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కెమెరా ముందు సందడి చేస్తూ కన్పిస్తుంటారు. పెద్దకూతురు శివాని, నటుడు అడవి శేష్ తో ప్రారంభించి '2స్టేట్స్' రీమేక్ ఆగిపోయింది. ఇక చిన్న కూతురు శివాత్మిక మాత్రం దొరసాని సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేసింది. అంతేగాక ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటో షూట్స్ తో తమకు హీరోయిన్ మెటీరియల్ ఉందని నిరూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక తాజాగా శివాత్మిక డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తాండలో ఓ ముఖ్యపాత్రలో నటించబోతుందట. నిజానికి శివాత్మిక కంటే శివాని కొంచెం ఎక్కువ అందంగా ఉంటుంది. కానీ ఆమె ఇంతవరకు ఎంట్రీ కూడా ఇవ్వలేదు. ఇటీవలే ఇద్దరు కలిసి స్విమ్ సూట్లలో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నిజానికి దొరసానిలో శివాత్మిక నటనకి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఎందుకో ఈ తెలుగు అందాలను దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు. సరైన అవకాశాలు సినిమాలు పడక వీరిద్దరూ ఇలా మిగిలిపోతున్నారు. కానీ అవకాశాలు వస్తే మాత్రం పక్కా ఈ సిస్టర్స్ స్టార్ హీరోయిన్స్ అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి కరోనా తర్వాత అయినా ఈ బ్యూటీల కెరీర్ మారి ఉపందుకుంటారేమో..!
Tags:    

Similar News