జాలీడే ముగిసింది.. ఇక వార్‌ కి రెడీ

Update: 2015-07-21 15:40 GMT
10రోజుల్లో 350కోట్ల వసూళ్లతో చరిత్రను తిరగరాసింది బాహుబలి. భారతదేశ చరిత్ర లో ఓ ప్రాంతీయ సినిమా కనీవినీ ఎరుగని అసాధారణ విజయమిది. ఇంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తీసిన దర్శకుడు ఇప్పుడు ఏం చేయాలి? .. పార్టీ లు, విందులు, వినోదాలు, శికార్లు అంటూ ఫుల్లు గా ఎంజాయ్‌ చేసేయాలి. కానీ ఇక్కడ సీను వేరే గా ఉంది.

అంత పెద్ద సక్సెస్‌ వచ్చినా దాంతో పాటు వచ్చే బిరుసు నెత్తికెక్కించుకోకుండా జక్కన్న మళ్లీ తన రూట్‌ లోకే వచ్చేశాడు. సైలెంటుగా ఓ ఐదు రోజులు ఫ్యామిలీ తో పాటు దగ్గర్లో ఉన్న ఓ విదేశం వెళ్లొచ్చాడు. జాలీడేస్‌ పూర్తి చేసి, ఈరోజే తిరుగు విమానం ఎక్కేసి ఇంటికొచ్చేశాడు. మళ్లీ తన పని మొదలెట్టేశాడు. మరోసారి యుద్ధానికి తెరతీశాడు. ఇక నుంచి రిగరస్‌ గా బాహుబలి-2 (ది కన్‌ క్లూజన్‌) కథా చర్చలు సాగుతాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలెట్టేశారు.  ప్రభాస్‌ ఈరోజు రాత్రికి మీడియా మిత్రులకు హైదరాబాద్‌ లో పార్టీ ఇచ్చేసి యూరప్‌ శికారు వెళ్తున్నాడు. అతడు మళ్లీ రాగానే గెటప్‌ కి సంబంధించిన చర్చలు సాగుతాయి.

ఇక అనుష్క ఈలోగానే పెరిగిన 20కేజీల బరువు తగ్గించడానికి జిమ్ముల్లో కుస్తీలు పడుతుంది. పార్ట్‌ 2 సెట్స్‌ కెళ్లడానికి ఇంకో నెలన్నర రోజులే గ్యాప్‌. మళ్లీ సెప్టెంబర్‌ లో సెట్స్‌ కి వెళ్లిపోవాలి. కాబట్టి ఇక నుంచి రణరంగమే. యుద్ధంలోకి దిగిన వీరుడికి అలుపన్నది దరిచేరదు. ఓటమి ఎరుగకుండా గెలుపే ధ్యేయంగా ముందుకెళతాడు. దటీజ్‌ రాజమౌళి. 
Tags:    

Similar News