రాజమౌళి అతణ్ని కొట్టిద్దామనుకున్నాడట

Update: 2015-07-05 13:30 GMT
సెట్‌లో రాజమౌళి రాక్షసుడిలా ఉంటాడని అంటారు కానీ.. మామూలుగా అయితే రాజమౌళి చాలా శాంత స్వభావుడిలాగే కనిపిస్తాడు. బయటెక్కడైనా ఫంక్షన్లకు వచ్చినా.. మీడియాతో మాట్లాడినా చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. చాలా మృదువుగా మాట్లాడతాడు. అలాంటి వాడు ఓ వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడట. ఆ వ్యక్తిని కొట్టించాలని కూడా ప్లాన్‌ చేశాడట. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏమా కథ? రాజమౌళి మాటల్లోనే విందాం పదండి.

''మేం చెన్నైలో ఉండేటపుడు నాన్న విజయేంద్ర ప్రసాద్‌ ఘోస్ట్‌ రైటర్‌గా పని చేసేవారు. ఆయనకు డబ్బులెప్పుడు వస్తాయో తెలియదు. అంతవరకు ఇల్లు గడవాలంటే అప్పులే దిక్కు. మాది పెద్ద కుటుంబం. కిరాణా, కూరగాయల షాపుల్లో ఖాతాలో ఉండేది. ఓ వందా, నూటయాభై వచ్చే వరకు పెద్దవాళ్లు వెళ్లి సరుకులు తెచ్చేవాళ్లు. తర్వాత ఇంట్లో పిల్లల్ని పంపేవాళ్లు. ఓసారి అలానే నేను టమోటాలు తీసుకురావడానికి వెళ్లా. ఐతే షాపు వాడు ఎంతసేపు అన్నా.. అన్నా.. అంటున్నా వినిపించుకోలేదు. ఓపిక తగ్గిపోయి గట్టిగా ''అన్నా'' అని అరిచా. అతను ''రేయ్‌.. ఆగరా'' అన్నాడు. నాకు ఏడుపు తన్నుకొచ్చింది. అప్పటివరకు బయటివాళ్లెవరూ నన్ను రేయ్‌ అనలేదు. నేను జీవితంలో బాధపడింది.. ఓ వ్యక్తి మీద కక్ష పెంచుకుంది అప్పుడే. ఎప్పటికైనా డబ్బులు సంపాదించి.. మనుషుల్ని పెట్టి అతణ్ని కొట్టించాలనుకున్నా. ఇప్పుడు అతణ్ని కొట్టించాలన్న ఆలోచనన లేదు కానీ.. ఆ సంఘటన వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలన్న కోరిక మాత్రం పెరిగింది'' అని చెప్పాడు రాజమౌళి.

Tags:    

Similar News