అప్పుడే రిటైర్ మెంట్ పై స్పందించిన స్టార్ డైరెక్టర్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ (రౌద్రంరణంరుధిరం) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కల్పనిక కథతో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న రాజమౌళి ఇంతవరకు తను తీసిన అన్నీ సినిమాలు హిట్లే. మరి రాజమౌళి సినీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా పరిచయం అయ్యారు.
రాజమౌళి తన ప్రతి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. దర్శకుడిగా ఇప్పటికే జక్కన్న ఎన్నో రికార్డులను బద్దలుకొట్టారు. కానీ ఒక్కో సినిమాకి ఆయన చాలా సమయం తీసుకుంటారు. ఇక సందర్భం వచ్చింది కదా అని.. తన రిటైర్మెంట్ విషయం ప్రస్తావించారు. ఆయన మరో పదేళ్ల వరకు రిటైర్‌మెంట్ తీసుకోనని ప్రకటించారు. రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లాలోని ఈదులూరు గ్రామంలో ఉంటారట. రిటైర్ అయ్యాక, పిల్లలంతా స్థిరపడ్డాక అక్కడికి వెళ్లి వుండాలని ముందే ప్లాన్ చేసుకున్నారట. అక్కడే ఫామ్ హౌస్‌లు నిర్మించుకుని మిగిలిన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారట.