ప్రభాస్.. జక్కన్న మతిపోగొట్టిన వేళ!
యాక్షన్ సన్నివేశాలంటే ఏముందిలే డూపులతో లాగించేస్తారు.. కట్ చేసి కట్ చేసి తీస్తారు కాబట్టి కష్టమేముంది అని తేలిగ్గా కొట్టి పారేస్తాం కానీ.. అక్కడికెళ్లి లొకేషన్ లో చూస్తే తెలుస్తుంది ఆ కష్టమేంటో. ఒక చిన్న మూమెంట్ కోసం గంటల తరబడి వాళ్లు పడే కష్టం మామూలుగా ఉండదు. ఇక బాహుబలి లాంటి సినిమా కోసం ప్రభాస్, జక్కన్న అండ్ టీమ్ ఎలా కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. బ్యాగ్రౌండ్ లో కనిపించేదంతా గ్రాఫిక్స్ మాయాజాలమే కావచ్చు.. హీరోకు రోప్ లతో ఫుల్ సపోర్ట్ ఇస్తుండొచ్చు.. కానీ హీరో పడాల్సిన కష్టం హీరో పడాల్సిందే. ఆ కష్టం ఎలా ఉంటుందో మాటలు చెప్పకుండా సింపుల్ గా ఓ ఫొటోతో కళ్లముందుకు తెచ్చాడు రాజమౌళి.
కొండమీది నుంచి అవతలి వైపున్న తమన్నాను అందుకోవడానికి ప్రభాస్ గాల్లోకి డైవ్ చేస్తాడు గుర్తుందా? అక్కడ కొండా లేదు, జలపాతమూ లేదు. కానీ ప్రభాస్ డైవ్ మాత్రం చేశాడు. దానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసి.. ఆ సమయంలో తామెంత మెస్మరైజ్ అయిపోయామో వెల్లడించాడు జక్కన్న. ఈ సన్నివేశం తీయడానికి కొన్ని రోజుల ముందు ప్రభాస్ భుజానికి సర్జరీ జరిగిందని.. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి ఆ సీన్ చేయడం మామూలు విషయం కాదని.. ఆ షాట్ చేస్తున్నపుడు సినిమా యూనిట్ మొత్తం అలా చూస్తుండిపోయిందని చెప్పాడు రాజమౌళి. షాట్ ముగియగానే యూనిట్ మొత్తం చప్పట్లతో ఆ ప్రదేశాన్ని మార్మోగిపోయేలా చేసిందని జక్కన్న తెలిపాడు.