రాజమౌళి కి బోర్ కొట్టేలా చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ?

Update: 2020-04-21 09:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి లాక్ డౌన్ సమయం కావడంతో గత కొన్ని రోజులుగా పలు ఛానళ్లకు ఇంటి వద్ద నుండే వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వూస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూల ద్వారా తన క్వారంటైన్ లైఫ్ గురించి.. ఆర్.ఆర్.ఆర్ సినిమా సంగతులను.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ తో అంటూ రకరకాల విషయాలను వెల్లడిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమా 'పారాసైట్'పై జక్కన్న స్పందించారు. ఆ సినిమా తనకు చాలా బోర్‌ గా అనిపించిందని రాజమౌళి షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో ఇప్పుడు ఈ కామెంట్లు హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

2019 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా కొరియన్ మూవీ 'పారాసైట్' ఆసార్క్‌ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియాలో పేద - ధనవంతుల జీవనం మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ బాన్‌ జూన్‌ హో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫెస్టివల్స్‌ లో అవార్డును సాధించిన పారాసైట్.. ఉత్తమ విదేశీ చిత్రం - ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు - ఉత్తమ స్క్రీన్‌ ప్లే కేటగిరీల్లో నాలుగు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రిటిక్స్‌ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ మధ్య ప్రముఖ ఆన్‌ లైన్‌ ఫ్లాట్‌ ఫాంలో పారసైట్ చిత్రాన్ని చూసిన రాజమౌళి మాత్రం సగం సినిమా చూసి మధ్యలోనే నిద్రపోయాడంట. ఈ విషయాన్ని రాజమౌళి ఆ సినిమా చాలా స్లో గా ఉండటంతో నిద్రొచ్చేసిందని నిజాయతీగా చెప్పేసాడు.

వాస్తవానికి ఆస్కార్ సాధించిన ఈ సినిమాపై చాలా మంది విమర్శించారు. కొంతమంది బెస్ట్ మూవీ అని కితాబిచ్చారు. మరికొంత మంది సినిమా ఓకే బట్ ఆస్కార్ రేంజ్ కాదని అప్పట్లోనే కామెంట్ చేసారు. రాజమౌళికి స్లో నేరేషన్ సినిమాలు నచ్చవని గతంలో కూడా చాలాసార్లు చెప్పాడు కూడా. ఏదేమైనా జక్కన తన అభిప్రయాన్ని ప్రాంక్ గా చెప్పినందుకు కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు ఆస్కార్ విన్నింగ్ సినిమా పై ఇప్పుడు రివ్యూ ఇవ్వడం ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News