శిఖర్ ధావన్ పెళ్లి.. వధువు సొగసు చూడతరమా
సహజీవనం చేస్తున్నారా? అంటే... వీరిద్దరూ గత ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. సోఫీ ప్రస్తుతం భారత్‌లో ధావన్‌తోనే ఉంటున్నారు.;
టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న అతడు ఇటీవల కొన్నేళ్లుగా ఒంటరి. కానీ ఇప్పుడు జంట షికార్లు చేస్తున్నాడు. విదేశీ మోడల్ సోఫీ షైన్ తో అతడి డేటింగ్ కొన్ని నెలలుగా ఇంటర్నెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ఐర్లాండ్‌కు చెందిన కార్పొరేట్ ప్రొఫెషనల్.
ఈ జంట మొదట ఎప్పుడు, ఎక్కడ కలుసుకున్నారు?
వీరిద్దరూ కొన్ని ఏళ్ల క్రితం దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో సోఫీ క్యామోఫ్లేజ్ దుస్తుల్లో ఉండగా తనను చూసి ధావన్ ఫిదా అయ్యారట. అలాగే ధావన్ కళ్లలోని 'తుంటరితనం` చూసి తాను ఆకర్షితురాలినయ్యానని సోఫీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సహజీవనం చేస్తున్నారా? అంటే... వీరిద్దరూ గత ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. సోఫీ ప్రస్తుతం భారత్‌లో ధావన్‌తోనే ఉంటున్నారు. ఈ భామ కేవలం ధావన్ భాగస్వామిగానే కాకుండా అతడికి చెందిన `శిఖర్ ధావన్ ఫౌండేషన్` బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు.
పెళ్లి ఎప్పుడు?
తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్థం జనవరి 2026లో జరిగింది. ఫిబ్రవరి 2026 మూడవ వారంలో నిఖా జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి వేడుకలు ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఘనంగా జరగనున్నాయి.
శిఖర్ ధావన్ 2023లో అయేషా ముఖర్జీతో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. చట్టపరంగా విడిపోయిన తర్వాత, తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది. సోఫీ కూడా ధావన్ కుటుంబంతో - ఆయన ఫౌండేషన్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ ఇద్దరూ పెళ్లితో కొత్త ఆనందకర జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.