టాక్ ఎలా ఉన్నా.. ఓదెల మళ్లీ అక్కడే కొట్టాడు!
కొన్ని సీన్స్ దగ్గర తెలంగాణ ఆడియన్స్ ఇచ్చిన రియాక్షన్ చూస్తే, వాళ్లకు ఆ ప్రపంచం బాగా పరిచయమైనట్టే అనిపించింది. చిన్న డీటైల్స్ కూడా వాళ్లను వెంటనే పట్టేశాయి.
ప్యారడైజ్‌కి వచ్చిన టాక్ ఇప్పుడు బాక్సాఫీస్ నీ కాస్త కన్ఫ్యూజన్ లో పెట్టేసింది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బ్లాక్స్ నచ్చాయని చెప్పేవాళ్లు ఉన్నారు, సెకండ్ హాఫ్‌లో వయలెన్స్ ఎక్కువైందని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడిన మరో పాయింట్ మాత్రం సినిమా రిజల్ట్‌కు సంబంధం లేనిది. కొన్ని సీన్స్ దగ్గర తెలంగాణ ఆడియన్స్ ఇచ్చిన రియాక్షన్ చూస్తే, వాళ్లకు ఆ ప్రపంచం బాగా పరిచయమైనట్టే అనిపించింది. చిన్న డీటైల్స్ కూడా వాళ్లను వెంటనే పట్టేశాయి.
శ్రీకాంత్ ఓదెల చేసిన వర్క్ కి తెలంగాణలో ఓ వర్గం ఆడియెన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్యారడైజ్ పెద్ద స్కేల్‌లో తీసిన సినిమా అయినా, పాత్రలు మాట్లాడే తీరు నుంచి పేర్లు, లోకల్ రాజకీయాల టచ్ వరకు తెలంగాణ వాసన తగ్గించలేదు. జడల్ చిన్నప్పటి ఎపిసోడ్, సమ్మక్క పాత్ర, కొన్ని స్లాంగ్ డైలాగ్స్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బయట వాళ్లకు కొత్తగా అనిపించే పదాలు ఇక్కడి వాళ్లకు మాత్రం ఇంట్లో వినే మాటల్లా ఉన్నాయి.
దసరాలో కూడా ఓదెల ఇదే నేలను పట్టుకున్నాడు. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌ను విజువల్‌గా హైలెట్ చేస్తూ, అక్కడి మనుషులు ఎలా మాట్లాడతారు, ఎలా బతుకుతారు అన్నదాన్ని కథలో పెట్టాడు. ఇప్పుడు ప్యారడైజ్‌లో ప్రపంచం మారింది, బడ్జెట్ పెరిగింది, యాక్షన్ కూడా చాలా ఎక్కువైంది. ప్రియదర్శి చేసిన KCR పాత్ర దీనికి మంచి ఉదాహరణ. పేరు మార్చినా ఆ పాత్ర ఎవరిని గుర్తు చేస్తుందో ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు.
థియేటర్లలో వచ్చిన రియాక్షన్, బయట మొదలైన మీమ్స్ చూస్తే ఆ క్యారెక్టర్ ఎంత త్వరగా కనెక్ట్ అయిందో తెలుస్తోంది. చిన్న రోల్ అయినా గుర్తుండిపోయేలా నిలిచింది. ఆ పాత్రకు పెట్టిన మాస్ ఎలివేషన్ కూడా వెంటనే నోటీస్ అయింది. అయితే ఈ నేటివిటీ ఒక్కటే సినిమా మీద వచ్చిన మిక్స్‌డ్ టాక్‌ను మార్చలేదు. ఫస్ట్ 30 నిమిషాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్, జడల్ చిన్నప్పటి భాగం, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి కామెంట్స్ వచ్చాయి.
మరోవైపు సెకండ్ హాఫ్‌లో మాస్ ఓవర్‌డోస్, ఎక్కువ వయలెన్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. కీర్తి సురేష్ సాంగ్ నచ్చినా, అది వచ్చే సిట్యుయేషన్ కుదరలేదనే మాట కూడా వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటే లోకల్ పదాలు తగ్గించి, అందరికీ ఒకేలా అర్థమయ్యే భాషలోకి వెళ్లే ట్రెండ్ చాలా చోట్ల కనిపిస్తోంది. ఓదెల మాత్రం దసరా నుంచి ఆ రూట్ తీసుకోలేదు. స్కేల్ పెరిగినా తెలంగాణ పలుకుబడి, రాజకీయ రిఫరెన్సులు, స్థానిక పాత్రల్ని అలాగే ఉంచుతున్నాడు. ప్యారడైజ్‌పై టాక్ ఎలా ఉన్నా, తెలంగాణ ఆడియన్స్ ఓదెలను మెచ్చుకుంటున్న భాగం మాత్రం ఇదే. ఇక సినిమాకు తెలంగాణలో ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి అనేది చూడాలి.