ఇండస్ట్రీ లో ఆ ఇద్దరు స్టార్ హీరోలకు శత్రువులు ఎక్కువ...కారణమేంటంటే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ మార్క్ ను చూపిస్తు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు.

Update: 2026-09-24 07:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ మార్క్ ను చూపిస్తు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారడం అనేది అంత ఆశామాషి వ్యవహారమైతే కాదు. దాని కోసం ఎంతో కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగారు కాబట్టి ఈరోజు టాప్ హీరోల పొజిషన్లో కొనసాగుతున్నారనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ఇద్దరు స్టార్ హీరోలు ఎన్నో మంచి సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పించారు. కానీ వాళ్ళిద్దరికీ ఇండస్ట్రీలో కొంతమంది శత్రువులు ఉన్నారనే వార్తలైతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆ హీరోలు ఎవరు అంటే ఒకరు మోహన్ బాబు కాగా, మరొకరు రాజశేఖర్ కావడం విశేషం. వీళ్లిద్దరు వాళ్ల కెరియర్ లో చాలా గొప్ప పాత్రలను పోషిస్తూ కమర్షియల్ హీరోలుగా పేర్లు తెచ్చుకున్నారు. ఇక నిజ జీవితంలో వాళ్ళు ఎలాంటి దాపరికలు లేకుండా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వాళ్లు చాలా రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కుంటారు. ఏదేమైనా కూడా సినిమాలపరంగా వీరిద్దరు డిఫరెంట్ మూవీస్ ను చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల రేంజ్ కు కూడా వెళ్లిపోయారు. 'పెదరాయుడు' సినిమాతో మోహన్ బాబు ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వీళ్ళు ప్రస్తుతం సోలో హీరోగా సినిమాలను చేయడం లేదు.

సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పలు రకాల క్యారెక్టర్ లను పోషిస్తూ ప్రేక్షకుల్లో ఐడెంటిటిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు... ఆ క్రమంలో ఎవరితో అయిన సరే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతూ తమ సినిమాలో గాని బయట జీవితంలో గాని వాళ్లకు ఏదైతే కావాలో దానిని తీసుకొచ్చుకునే నైజం కలవారు. ఇలాంటి క్రమంలో కొంతమందితో వాళ్లు విభేధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల వాళ్లకు ఇండస్ట్రీలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇండస్ట్రీలో వాళ్లకు మంచి ఫ్రెండ్స్ తో పాటు కొంతమంది శత్రువులు కూడా తయారయ్యారు అంటూ గతంలో వాళ్లే ఓపెన్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

చాలా రోజుల నుంచి మోహన్ బాబు వద్దకు చాలా రకాల క్యారెక్టర్లు వెళ్తున్నాయి. కానీ ఆయనకి నచ్చిన క్యారెక్టర్ దొరక్కపోవడంతో అన్ని కథలను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు శ్రీకాంత్ ఓదెల చెప్పిన 'శికంజీ మాలిక్ ' పాత్ర ఆయన్ని ఎగ్జైట్ చేయడంతో 'ప్యారడైజ్ ' సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈరోజు రిలీజైన ఈ మూవీలో మోహన్ బాబు పాత్ర కి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ఈ క్యారెక్టర్ ఇచ్చిన హై తో ఇంకెవరైనా డైరెక్టర్లు ఇలాంటి పాత్రలతో తనను సంప్రదిస్తే ఆయన తప్పకుండా ఆ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ గా ఉన్నారు. ఇక రాజశేఖర్ సైతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. 'బైకర్' సినిమాలో తను చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. తద్వారా ఆయనకు మరిన్ని గొప్ప పాత్రలు చేసే అవకాశాలైతే దక్కుతున్నాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రాజశేఖర్ ఎలాంటి పర్ఫామెన్స్ ని ఇస్తాడు. ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...

Tags:    

Similar News