బాలీవుడ్ దుస్థితికి ఇదే ప్రధాన కారణం..!
ఓటీటీ ఇతర మార్గాల ద్వారా మాత్రమే నిర్మాతలు బయట పడుతున్నారని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అనగానే బాలీవుడ్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే బ్రాండ్ ఇమేజ్‌ను బాలీవుడ్ దక్కించుకుంది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పూర్తిగా మారింది. హిందీ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాల్లో దాదాపుగా 98% సినిమాలు మినిమం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోలేక పోతున్నాయి. అంతే కాకుండా ఎక్కువ శాతం సినిమాలు కేవలం ఓటీటీల కోసం అన్నట్లుగా తీస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక విశ్లేషణ ప్రకారం బాలీవుడ్‌లో రూపొందుతున్న దాదాపు 75 శాతం సినిమాలు పెట్టిన పెట్టుబడిని థియేట్రికల్ రైట్స్ ద్వారా రికవరీ చేయలేక పోతున్నాయట. ఓటీటీ ఇతర మార్గాల ద్వారా మాత్రమే నిర్మాతలు బయట పడుతున్నారని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం...
బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం హిట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఒకరు ఇద్దరు హీరోలు మినహా మరెవ్వరూ కంటిన్యూగా సక్సెస్‌లను సొంతం చేసుకోలేక పోతున్నారు. సౌత్ సినిమాల స్థాయిలో బాలీవుడ్ సినిమాలు ఉండటం లేదు అనే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. కంటెంట్ పరంగా మలయాళ సినిమాలకు బాలీవుడ్ సినిమాలు ఆమడ దూరంలో ఉంటున్నాయి. మరో వైపు బడ్జెట్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌ను ఎప్పుడో క్రాస్ చేశాయి. కనుక బాలీవుడ్ సినిమాల స్థాయి తగ్గింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో రూపొందుతున్న సినిమాల్లో సగానికి పైగా లో బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. అయినా కూడా అవి బడ్జెట్‌ను రికవరీ చేయడంలో విఫలం అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం దర్శకుల ఎంపిక అనే విమర్శలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
హిందీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్...
స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు దర్శకుల విషయంలో నిర్మాతలకు కండీషన్స్ పెట్టడం బాలీవుడ్‌లో సర్వసాధారణం. అంటే తాము ఫలానా దర్శకుడితో మాత్రమే సినిమాను చేస్తాను, ఆ దర్శకుడు అయితేనే తాను నటిస్తాను అంటూ చాలా మంది హీరోలు పట్టుబడుతున్నారట. అందుకే నిర్మాతలు చేసేది ఏం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దర్శకుడితోనే సినిమాను నిర్మించాల్సి వస్తుంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చాలా మంది హీరోలు ఒకరు ఇద్దరు దర్శకులతో మాత్రమే సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఆ దర్శకులు ఫ్లాప్ ఇచ్చినా మళ్లీ మళ్లీ వారితోనే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకు కారణం బంధు ప్రీతి లేదా మరేమైనా అయ్యి ఉంటుంది అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇండస్ట్రీలో ట్యాలెంట్ లేని దర్శకులు చాలా మంది వరుస సినిమాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు...
యంగ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. వారు మొదట వెబ్ సిరీస్‌లు, ఓటీటీ సినిమాలతో తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి వస్తుంది. పెద్ద హీరోల వరకు ఆ కొత్త దర్శకులకు కనీసం కథ చెప్పేందుకు సైతం వెళ్లే అవకాశాలు దక్కవట. అందుకే బాలీవుడ్‌లో కొత్త దర్శకులు ఎక్కువగా రావడం లేదని, అదే సౌత్ లో ఏడాదికి పదుల సంఖ్యలో కొత్త దర్శకులు వస్తున్నారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో దర్శకులను కంటిన్యూ చేయడం, హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కంటిన్యూగా ఆ దర్శకులతో సినిమాలు చేయడం అనేది కచ్చితంగా కరెక్ట్ కాదు, ఎప్పుడైతే కొత్త వారికి ఛాన్స్ దక్కుతుందో అప్పుడే బాలీవుడ్‌కి మంచి రోజులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతి ఎప్పుడు తగ్గుతుందో అప్పటి వరకు ఈ దుస్థితి తప్పదు.