జక్కన్న మాట: బాహుబలి-2లో అదే హైలైట్
బాహుబలి సినిమా చూశాక బాహుబలి-2 మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆ అంచనాల్ని మరింత పెంచే మాటలు చెబుతున్నాడు రాజమౌళి. ‘బాహుబలి: ది బిగినింగ్’ కంటే.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇంకా భారీగా ఉంటుందని.. ప్రేక్షకులు కళ్లు తిప్పుకోలేని విధంగా ఈ సినిమా ఉంటుందని రాజమౌళి చెప్పడం విశేషం.
బాహుబలి-2 విశేషాల గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మామూలుగా ఓ సినిమాను రెండు.. రెండున్నర గంటలు తీస్తాం. కానీ బాహుబలి కథ పెద్దది కావడం వల్ల నాలుగున్నర ఐదు గంటలకు చేరింది. రెండున్నర గంటల సినిమాలో గంట గంటన్నర పాత్రల పరిచయానికి సరిపోతుంది. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. కానీ మేం ‘బాహుబలి’లో పాత్రల పరిచయానికి రెండు రెండున్నర గంటలు తీసుకున్నా. అసలు కథ బాహుబలి-2లోనే ఉంటుంది. విజువల్ ఎఫెక్టులు.. యుద్ధ సన్నివేశాలు తొలి భాగానికి ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటాయి. ఐతే వాటి కంటే కూడా ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్లే రెండో భాగానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నా నమ్మకం.
బాహుబలి-శివగామి.. బాహుబలి-దేవసేన.. బాహుబలి-భల్లాలదేవ.. భల్లాలదేవ-దేవసేన.. ఇలా పాత్రల మధ్య ఏం జరిగింది.. ఆయా పాత్రల మధ్య ఎమోషన్ ఎలా ఉంటుంది అన్నది ప్రధానంగా రెండో భాగంలో చూపిస్తాం. అలాగే 2015 సంవత్సరానికి అతి పెద్ద ప్రశ్నగా మారిన ‘బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు’ అన్నదానికి కూడా సమాధానం చెబుతాం’’ అన్నాడు. ఇంతకీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని రాజమౌళిని అడగ్గా.. నేను చెప్పా కాబట్టి చంపాడు అని చమత్కరించడం విశేషం.