ప్రతిదీ సగం సగం చూపించాడు

Update: 2015-07-11 06:33 GMT
బాహుబలి ఓ వైపు రికార్డులు తిరగరాస్తుంటే మరోవైపు ఈ సినిమాలోని లోపాల్ని వెతుకుతూ లోతుపాతుల్ని విశ్లేషిస్తూ కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకే పని పెట్టుకున్నారు. ముఖ్యంగా నేషనల్‌ మీడియాలో ఇలాంటి కథనాలు బోలెడన్ని వస్తున్నాయి. అయితే ఇదంతా జక్కన్న ముందే ఊహించనిదా అంటే ఊహించినదే.

అదెలాగంటే.. వాస్తవానికి బాహుబలి కథే లేనప్పుడు ఒకటే సినిమా అనుకున్నారు. కథ రెడీ అయ్యాక ఐదు గంటల సినిమాగా తీస్తేనే కిక్కు అని భావించి అదే ప్రయత్నం చేశారు. రెండున్నర గంటలు చొప్పున సినిమాని నరికేసి రెండు భాగాలు చేశారు. అందుకే తొలి భాగంలో ప్రతి పాత్రా అసంపూర్ణంగా కనిపిస్తుంది. ఇందులో కనిపించిన పాత్రలన్నిటిలో 8 పాత్రలు హైలైట్‌గా ఉంటాయి.

అవంతికతో శివుడి ప్రేమ, రొమాన్స్‌కి సంబంధించిన పార్ట్‌ అసంపూర్ణంగానే మిగిలిపోయింది. అసలు అవంతిక అసలు లక్ష్యం వేరొకవైపు టర్న్‌ అయిపోయింది. అలాగే బాహుబలిపై భళ్లాల దేవుని కుట్రకు సంబంధించిన అసలు పార్ట్‌ అస్సలు రివీల్‌ కానేలేదు. కోపం, కసి, కుట్ర అతడి కళ్లలో చూపించే ప్రయత్నం చేశారు కానీ అవేవీ ఇంకా రివీల్‌ కానే లేదు. అయితే కాళికేయని చంపేసి ఆ పాత్రని ఎండ్‌ చేశారు. నాజర్‌ పాత్రలో క్రోధాన్ని బైటికి తీయలేదింకా. సాధ్యమైనంత వరకూ శివగామి (రమ్యకృష్ణ), కట్టప్ప (సత్యరాజ్‌) పాత్రల్ని చాలా వరకూ ఆవిష్కరించినా ఇంకా కంటిన్యూషన్‌ అలాగే మిగిలి ఉంది... అంటూ నేషనల్‌ మీడియాలు సినిమా గురించి ఎనలాసిస్‌లు వ్రాయసాగాయి.

తెలుగు సినిమాల్లో పెర్ఫెక్ట్‌ ఎండింగ్‌ తప్పనిసరి. కానీ రూల్‌ని బ్రేక్‌ చేసి బాహుబలి ఎండింగే లేని సినిమా అని చెప్పకనే చెప్పారు. పాత్రలన్నిటా సందిగ్ధాల్ని రగిలించి వదిలేశారు. యుద్ధంలో రాజుకి, సైన్యానికి మధ్య కనిపించే వేరియేషన్‌ పెద్దగా కనిపించలేదు. అందరూ వీరుల్లాగే కనిపించారు కాబట్టి హీరోయిజం కొంతవరకే ఎలివేట్‌ అయ్యింది. ట్రాయ్‌లో వీరాధివీరుడు ఒక్కడే వెళ్లి కోటలోని రాకుమారుడితో తలపడి తలనరికి తెచ్చే సన్నివేశం ఒక్కటీ లేదు. భారీ వార్‌ ఎపిసోడ్‌లో అన్నీ ములిగిపోయినట్టు అనిపించాయి.

ఇండివిడ్యువల్‌గా వీరత్వం ప్రదర్శించే అవకాశం అటు బాహుబలికి కానీ, ఇటు భళ్లాదేవునికి కానీ కనిపించలేదు. అలాగే సినిమాలో పాటలు అడ్డుపుల్లలాగా కనిపించాయి తప్ప వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఏం లేదు. పచ్చ బొట్టేసి తప్ప మిగతా పాటలన్నీ అడ్డు పుల్లలే. ఇలా విమర్శలే విమర్శలు. కానీ ఇవేవీ కామన్‌ జనాలు గుర్తుంచోకోనివి.

Tags:    

Similar News