జక్కన్న మాట: బాహుబలిలో అదే పెద్ద ఛాలెంజ్
బాహుబలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి ఎంత ఆనందాన్నిచ్చాడో.. మన సినిమా గౌరవాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కష్టాన్ని జాతీయ అవార్డుల కమిటీ కూడా గుర్తించింది. ‘బాహుబలి’ని 2015 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగానూ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఈ దర్శక ధీరుడితో జరిపిన ఓ చిట్ చాట్ కు సంబంధించిన వీడియోను ‘బాహుబలి’ని హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్లో పెట్టాడు. ఈ వీడియోలో ‘బాహుబలికి’ సంబంధించిన అనేక విశేషాలపై జక్కన్న మాట్లాడాడు.
ఈ సందర్భంగా బాహుబలి సినిమా షూటింగ్ లో ఎదురైన అతి పెద్ద సవాల్ ఏంటని జక్కన్నను అడిగితే.. ‘‘బాహుబలి షూటింగ్ మొత్తం 380 రోజులు జరిగింది. ఐతే 320-330 రోజులకు వచ్చేసరికి యూనిట్ సభ్యులందరినీ ఒకరకమైన నిరుత్సాహం ఆవరించింది. అందరిలోనూ అలసట కనిపించింది. ఇంకా ఎన్నాళ్లు అన్న ఫీలింగ్ లోకి వచ్చేశారు. ఐతే మిగతా ఇండస్ట్రీల సంగతేమో కానీ.. మా తెలుగు ఇండస్ట్రీ వరకు యూనిట్లో అందరూ దర్శకుడి నుంచే స్ఫూర్తి పొందుతారు. నిజానికి నేను కూడా ఆ సమయానికి బాగా అలసిపోయి ఉన్నాను. కానీ అదేమీ కనిపించకుండా ఉత్సాహంగా ఉన్నట్లు నటించడం మొదలుపెట్టాడు. నాకు నేను ఎనర్జీ తెచ్చుకున్నాను. మిగతా వాళ్లకు కూడా ఎనర్జీ ఇచ్చాను’’ అని చెప్పాడు రాజమౌళి.