• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి...

ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి మాస్టర్ ప్లాన్..?

By - Tupaki Desk
Update: 2021-05-26 11:30 GMT
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మల్టీస్టారర్ గా పీరియడిక్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గతేడాది కాలంగా సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక చిత్రం కాబట్టి ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ - మన్నెందొర కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ ప్రకటించిన ఈ సినిమా ఇంతవరకు పూర్తికాలేదు.

ప్రస్తుతం ఓవైపు కరోనా మహమ్మారి వణికిస్తుండటం కారణంగా లాక్డౌన్ పడి షూటింగ్స్ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలకు మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ చివరిదశలో ఉండటంతో ఆ కొద్దీ షూటింగ్ కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనీ రాజమౌళి బృందం ఆలోచిస్తుందట. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయిందని.. అంతలో ఈ మహమ్మారి రావడంతో అసలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కుదరటం లేదని ఆల్టర్నేట్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రేక్షకులలో రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. అందులోను ఇండియా వైడ్ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యేసరికి ఫ్యాన్స్ ఒత్తిడి కూడా అర్ధం అవుతోంది.

అయితే నిజానికి ఈ ఏడాది అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అంటే పరిస్థితి బాగుంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా అనుకున్న టైంకు వచ్చేది కాబోలు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కాబట్టి రాజమౌళి బృందం ఈ ఏడాది నవంబర్ నెల వరకు ఆర్ఆర్ఆర్ పనులు మొత్తం పూర్తి చేయాలనీ భావిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉండగా.. రాజమౌళి టీమ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇంపార్టెంట్ వర్క్ అంతా.. అంటే గ్రాఫికల్ సీజీ షాట్స్ కు చెందిన వర్క్ న్యూజీలాండ్ లోని పిక్సల్ స్టూడియోస్ వారితో కలిసి కంప్లీట్ చేయాలనీ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే సినిమాకు కావాల్సిన వర్క్ అంతా కూడా ఒకేసారి పూర్తి చేసేసి.. వెంటనే సినిమా రిలీజ్ అనౌన్స్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అలియా భట్ - ఓలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. చూడాలి మరి రాజమౌళి బృందం ఏ నిర్ణయం తీసుకోనుందో..!
Tags:    
  • RRR Shooting 
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS