ఒకరు నీరు ఒకరు నిప్పు - జక్కన్న మార్క్

Update: 2019-03-15 05:54 GMT
నిన్న ప్రెస్ మీట్ లో ఆర్ ఆర్ ఆర్ హీరోల పూర్తి లుక్స్ బయట పెట్టలేదు కానీ ఒక కన్ను మాత్రమే కనిపించే స్టైల్ లో ఇద్దరి కళ్ళల్లో ఇంటెన్సిటీని బాగా ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. అయితే ఒకరు అల్లూరి సీతారామరాజు మరొకరు కొమరం భీం అని రాజమౌళి క్లూ ఇచ్చినా పాత్ర తాలూకు కీలకమైన లక్షణాన్ని పోస్టర్లోనే పొందుపరిచిన విధానం బాగా గమనిస్తే అర్థమవుతుంది.

చరణ్ కన్ను కింద చెంపకు వాలుగా నిప్పుని ప్రతిబింబించే మంటలు జోడించారు. మరోవైపు సరిగ్గా అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ చెంప పక్కన ఎగసి పడుతున్న నీటిని సెట్ చేసారు. అంటే స్పష్టంగా చరణ్ చేస్తున్న రామరాజు పాత్ర నిప్పులా మండే తత్వం ఉంటె భీంగా కనిపించే జూనియర్ ఎన్టీఆర్ లో నీటిలా ఎగసిపడే లక్షణం ఉంటుందన్న మాట

ఇక్కడ రాజమౌళి చెప్పాలనుకున్న పాయింట్ ఒక్కటే. నీరు నిప్పు పంచభూతాలలోని రెండు కీలకమైన క్రియలు. వీటికి పాజిటివ్ నెగటివ్ రెండు కోణాలు ఉంటాయి. నిప్పు లోకానికి వెలుగు నిస్తుంది. జీవాధారమైన తిండిని వండుకోవడానికి ఊతమై నిలుస్తుంది. అదే క్రమంలో నిప్పు నిలువునా దహిస్తుంది. చిన్న కార్చిచ్చు అడవులని క్షణాల్లో బూడిద చేస్తుంది. ఒక్క నిప్పురవ్వ వేల ప్రాణాలు హరిస్తుంది.

ఇక నీరు లేనిదే మానవాళి లేదు. ప్రళయం వచ్చినప్పుడు మనిషి నిస్సహాయుడిగా మిగలడం తప్ప ఏమి చేయలేడు. మరి ఈ రెండు నీరు నిప్పు కలిస్తే బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగితే అదే ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి అన్నట్టు మాములు హీరోలనే ఓ రేంజ్ లో చూపించే తాను నిజమైన హీరోలను ఎలా చూపిస్తాడో ఊహకు అందటం కష్టమే
   

Tags:    

Similar News