జక్కన్న అస్సలు వెనక్కి తగ్గడం లేదుగా..!
వెండితెరపై వండర్స్ క్రియేట్ చేసి దర్శకధీరుడు అనిపించుకున్న రాజమౌళి.. సినిమాని ప్రారంభించిన తర్వాత ఎప్పుడు పూర్తి చేస్తాడు.. ఎప్పుడు విడుదల చేస్తాడు అనే విషయాలు మర్చిపోవాలని ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు. ఎందుకంటే ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా రావాలని తపించే జక్కన్న.. ఒక సినిమా చేయడానికి ఎక్కువ సమయమే తీసుకుంటాడు. 'బాహుబలి' రెండు భాగాలు చేయడానికి ఐదేళ్లు తీసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రానికి మూడేళ్లకు పైగా సమయాన్ని తీసుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయింది. కరోనా మహమ్మారి అడ్డు తగలకపోతే ఎప్పుడో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. గత ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తామని స్టార్ట్ చేసిన 'RRR'.. ముందుగా 2021 సంక్రాంతికి.. ఆ తర్వాత దసరాకు వాయిదా పడింది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈసారి కూడా చెప్పిన తేదీకి రావడం కష్టమే అనే పరిస్థితులు వచ్చాయి. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ పై రాజమౌళి క్లారిటీతో ఉన్నాడేమో అనిపిస్తోంది.
ఇటీవలే తిరిగి ట్రిపుల్ ఆర్ షూటింగ్ స్టార్ట్ చేసిన జక్కన్న టీమ్.. తాజాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు బైక్ పై వస్తున్న ఓ ఫోటోని వదిలారు. హీరోలిద్దరూ ఇప్పటికే రెండు భాషల్లో తమ డబ్బింగ్ ను పూర్తి చేశారని కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్ లో అక్టోబర్ 13 అంటూ విడుదల తేదీని ప్రస్తావించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన ఈ మూవీ మళ్ళీ వాయిదా పడుతుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనికి తగ్గట్లుగా దసరా స్లాట్ కోసం పలు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. కానీ ఎక్కడా తగ్గని జక్కన్న మాత్రం ఇంకా ఆ డేట్ మీద కర్చీఫ్ తీయడం లేదు. దీనిని బట్టి చూస్తే 'RRR' చిత్రాన్ని అనుకున్న తేదీకి తీసుకురావాలని మేకర్స్ ట్రై చేస్తున్నట్లు అర్థం అవుతోంది.
కాకపోతే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రెండున్నర నెలల సమయంలో రెడీ చేయడం సాధ్యమేనా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఒకేసారి విడుదల చేయడం కుదురుతుందా అని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇతర భాషలలో ఒకేసారి విడుదలయ్యే సినిమా కావడంతో అక్కడి పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రమోషన్లు మరియు ఇతర ఆర్థిక విషయాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.