మాటతో కాదు విజువల్‌తో కొట్టాలి -రాజమౌళి
ఇటీవలి కాలంలో పంచ్ డైలాగులు లేనిదే సినిమా లేదు. టాలీవుడ్‌లో ఇదో నయా ట్రెండ్. ప్రతి ఒక్కరూ బాలకృష్ణలాగా పంచ్‌లు వేసేవారే. చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా నాలుక కదిలించేయడమే. ఫలితం అస్సలు డైలాగులు వినాలంటేనే బోర్ కొట్టే పరిస్థితి వచ్చేసింది. అయితే అలాంటి భయాలేవీ అక్కర్లేదు. మాట కంటే విజువల్‌కే ఎక్కువ ప్రధాన్యతనిచ్చా. ఎమోషన్‌ని పీక్స్‌లో చూపించడానికే ప్రయత్నించానని అంటున్నారు రాజమౌళి.
బాహుబలి చిత్రంలో పంచ్ డైలాగులు, భారీ డైలాగులు ఒరగబెట్టేదేం ఉండవు. అవి కేవలం ఎమోషన్‌ని పీక్స్‌కి తీసుకెళ్లడానికి ఉపయోగపడేలా ఉంటాయి అంతే. బాహుబలి స్క్రిప్టు కేవలం 30 నుంచి 40 పేజీల డాక్యుమెంట్ మాత్రమే. మెజారిటీ భాగం విజువల్స్‌ని చూపించడానికే ప్రయత్నించా. అంతేకాదు నా సినిమాలన్నిటిలో విజువల్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చా. డైలాగ్ వినిపించినా అది విజువల్‌కి సపోర్ట్ ఉండేలా ఉపయోగించానంతే. ఈగ, మగధీర వంటి సినిమాల్లో అదే చేశాను.. అని రాజమౌళి చెప్పారు. ఇదంతా ప్రముఖ బాలీవుడ్ సినీవిమర్శకుడు రాజీవ్ మసంద్‌తో చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.
స్టార్ పవర్ అస్సెట్ అవుతుంది కానీ కంటెంటే ముఖ్యం. ఇటీవలి కాలంలో విజయం సాధించిన హిందీ సినిమాల జాబితాని పరిశీలిస్తే ఆ సంగతి మీకే అర్థమవుతుందని రాజమౌళి అన్నారు. కరణ్‌జోహార్‌తో కలిసి పనిచేయడం బావుంటుంది. అతడితో కలిసి ఓ హిందీ సినిమాకి పనిచేయాలనుందని రాజమౌళి తెలిపారు. ప్రేక్షకుల్ని విజువల్‌తో కొట్టడానికి కొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉందింకా.