రజనీకాంత్-రాజమౌళి సినిమా.. నిజమేనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజాకీయాల్లోకి వచ్చాడని ఇక రెండు మూడు సినిమాలకంటే నటించే అవకాశం లేదని చాలాకాలం క్రితమే అన్నారు. 'కబాలి' తర్వాత 'కాలా' ఒప్పుకున్నప్పుడు దాదాపుగా అదే చివరి సినిమా అని ప్రచారం సాగింది. కానీ ఆ సినిమా పూర్తయ్యేలోపు 'పెట్టా' అన్నాడు. 'పెట్టా' రిలీజ్ అయ్యేలోపు మురుగదాస్ సినిమాను లైన్లో పెట్టాడు.
రజనీ పొలిటికల్ పార్టీ.. అయన ఆధ్యాత్మిక రాజకీయాల సంగతేమో గానీ కోలీవుడ్ వినిపిస్తున్న టాక్ వింటే మీకు మతి పోవడం ఖాయం. మురుగా దాస్ సినిమా తర్వాత మరోసారి 'పెట్టా' డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇంతటితో ఆగడట రజనీ. ఈ సినిమా పూర్తి కాగానే టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని కొలీవుడ్ ఇప్పుడు కోడై కూస్తోంది. రజనీ ప్రస్తుత కమిట్మెంట్లు పూర్తయ్యేలోపు రాజమౌళి #RRR పూర్తి చేస్తాడని.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా రజనీతోనే ఉంటుందని అంటున్నారు.
నిజమో కాదో తెలియదు కానీ ఈ కాంబో కనుక ఫిక్స్ అయితే మాత్రం ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజమౌళి కూడా గతంలో సూపర్ స్టార్ రజనీ తో ఒక సినిమా చేయాలనీ ఉందని చెప్పాడు.. ఈ ప్రాజెక్ట్ కనుక ఫైనలైజ్ అయితే ఆయన జక్కన్న కోరిక కూడా తీరినట్టే.
Full View