రాజమౌళి ఆ హీరోతోనా? కష్టమే!!

Update: 2017-09-26 15:30 GMT
బాహుబలి తర్వాత దర్శకదీరుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో బాహుబలి ని మించిన స్పస్పెన్స్ ని చూపెడుతున్నాడు. ఒక సినిమా స్టార్ట్ అయితే సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు కానీ జక్కన్న అసలు ఏ సినిమా ను తీయడం లేదని చెప్పడం ఎవ్వరికి అంతూ చిక్కడం లేదు. దీంతో పలు మీడియా చానెళ్లు ఇష్టం వచ్చినట్టు కథనాలను ప్రచారం చేస్తున్నాయి.

రాజమౌళి నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే అనే లోపే మరో హీరోకి కథ చెప్పాడని మరొక వార్త వస్తోంది. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కథనాలు వస్తుండడంతో ప్రేక్షకులు సందిగ్ధంలో పడ్డారు. అయితే ఎవరు ఊహించని విధంగా మరొక కొత్త వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. సినిమా ప్రముఖుల నుండి సమాచారం ప్రకారం.. రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను రజినీ అల్లుడు తమిళ్ హీరో ధనుష్ తో తెరకెక్కించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. సీక్రెట్ గా ఆయనతో కథ చర్చలు జరిపినట్లు ఆ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దానయ్య ప్రొడక్షన్ లో అయితే రాజమౌళి సినిమా ఉంటుంది అనడం నిజమే కానీ ధనుష్ ని ఫైనల్ చేశారా అనేది ఇంకా అధికారికంగా వెలువడలేదు.

ఒక వేళ ఈ సినిమా ఒకే అయితే తెలుగు - తమిళ్ మరియు హిందీలో కూడా ఒకే సారి తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నటనలో అయితే ధనుష్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగలడు. కానీ తెలుగులో అతనికి అంతగా మార్కెట్ లేదు. కానీ ఈ హీరో ప్రయోగాలకి ఏ మాత్రం వెనుకడుగు వేయడు. ఇమేజ్ ని లెక్క చేయకుండా పాత్రలు చేయగలడు. బహుశా ఆ కోణంలో ఉండే కథను రాజమౌళి అల్లుతున్నాడా? ఏదైనా రాజమౌళి చెప్పేంత వరకు ఈ విషయంపై ఓ నిర్ణయానికి రావడం కష్టమే!!
Tags:    

Similar News