ఫోటో స్టోరి: ఆపిల్ బ్యూటీ సొగ‌సు చూడ‌త‌ర‌మా?

కాలక్రమేణా టాలీవుడ్, కోలీవుడ్‌లో కొత్త భామల ఎంట్రీతో ఈ బ్యూటీ కొద్దిగా రేసులో వెనకబడినా.. తనదైన గ్లామర్, సోషల్ మీడియా హవా అండ‌తో.. విభిన్న ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు.

Update: 2026-09-21 08:36 GMT

తెలుగు- తమిళ చిత్ర పరిశ్రమలలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలతో దూసుకుపోయిన హన్సిక మోత్వానీ బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే కెరీర్ ఆరంభంలో ఎక్కువగా గ్లామరస్ పాత్రలకే పరిమితం కావడంతో నటిగా పూర్తిగా నిరూపించుకునే బలమైన సోలో నాయిక పాత్రలు ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి. కాలక్రమేణా టాలీవుడ్, కోలీవుడ్‌లో కొత్త భామల ఎంట్రీతో ఈ బ్యూటీ కొద్దిగా రేసులో వెనకబడినా.. తనదైన గ్లామర్, సోషల్ మీడియా హవా అండ‌తో.. విభిన్న ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు.



 


ప్రస్తుతం 2026 సంవత్సరంలో హన్సిక కెరీర్ ప్రయాణం మరింత ఆసక్తికరంగా సాగుతోంది. కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా డిజిటల్ మాధ్యమాలు, ఓటీటీ సిరీస్‌లు అలాగే వైవిధ్యమైన క్యారెక్టర్ల కోసం ఈ భామ‌ మేకర్స్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. గ్లామర్ ఇమేజ్ నుంచి బయటపడి నటిగా తన పరిధిని విస్తరించుకోవడానికి హ‌న్షిక‌ కొత్త కథలను ఎంచుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా నటనపై తనకున్న మక్కువతో వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి హ‌న్షిక‌ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.



 


సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ హన్సిక తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. తాజాగా ఆపిల్ బ్యూటీ ధరించిన ఎత్నిక్ లుక్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. అచ్చమైన భారతీయ సంప్రదాయ దుస్తుల‌లో అందాలొలికిస్తూ అద‌ర‌గొట్టేసింది. హ‌న్షిక ధ‌రించిన‌ ఐవరీ అనార్కలీ శరారా సెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అందమైన దుస్తులపై చేసిన సున్నితమైన బంగారు వర్ణపు ఎంబ్రాయిడరీ ఒక సాఫ్ట్ లుక్ తో పాటు.. రాజసం ఉట్టిపడే లుక్‌ను తెచ్చిపెట్టింది.



 


ఈ అవుట్‌ఫిట్‌లోని ప్రత్యేకతలను పరిశీలిస్తే.. లాంగ్ కుర్తా రౌండ్ నెక్-లైన్ .. అందమైన డిజైన్‌లతో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనికి జోడీగా హ‌న్షిక‌ ధరించిన వాల్యూమినస్, ఫ్లోయింగ్ శరారా ఈ భామ‌ నడకకు అద్భుతమైన గ్రేస్‌ను తెచ్చిపెట్టింది. దానికి తోడు సమన్వయంతో కూడిన దుపట్టా ఈ ట్రెడిషనల్ లుక్‌ను మరింత పరిపూర్ణతను తెచ్చింది. దుస్తుల ఎంపికే కాకుండా...త‌న‌ స్టైలింగ్ కూడా ఈ లుక్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.



 


ఈ ట్రెడిషనల్ వేర్‌కు తగినట్లుగా హన్సిక ధరించిన స్పెష‌ల్ స్టేట్‌మెంట్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి. ఐవరీ కలర్ డ్రెస్‌పై ఆ బేస్ అందాన్ని మరింత పెంచుతూ పచ్చ -ఎరుపు రంగుల గాజులు చేతులకు ధరించి మరింత అందంగా కుదిరాయి. ముఖ్యంగా హ‌న్షిక‌ ముఖంలో కనిపించిన చిరునవ్వు ఈ పండుగ వాతావరణపు లుక్‌కి మరింత శోభను తెచ్చాయి. ఈ స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

Tags:    

Similar News