జక్కన్న మాట: మా నాన్నకు నేనే స్ఫూర్తి

Update: 2016-03-31 11:30 GMT
బాహుబలి కథ రాయడానికి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు తానే స్ఫూర్తి అని తాను భావిస్తున్నానని రాజమౌళి అన్నాడు. ఇంత భారీతనం కూడిన కథను విజయేంద్ర ప్రసాద్ ఎలా రాయగలిగాడని అడిగిన ప్రశ్నకు సమాధానంగా జక్కన్న ఈ వ్యాఖ్య చేశాడు. ‘‘మా నాన్నఈ కథ ఎలా రాశారో.. ఈ ఆలోచన ఎలా పుట్టిందో తెలియదు. కానీ ఈ కథ రాయడానికి ఆయనకు స్ఫూర్తి నేనే అనుకుంటాను. ఎందుకంటే నేనో గొప్ప దర్శకుడినని ఆయన భావిస్తారు. నా ప్రతిభకు పరీక్ష పెట్టడానికే ఆయన ఈ కథ రాశారు.. ఇలా అనుకుంటూ ఉంటాను’’ అంటూ నవ్వేశాడు జక్కన్న.

తన భారీ ఆలోచనలకు తగ్గట్లుగా భారీ బడ్జెట్ తో సినిమా తీయడానికి అవకాశం కలిగినపుడు తనకు మిశ్రమానుభూతి కలిగిందని రాజమౌళి చెప్పాడు. ‘‘బాహుబలి సినిమాను నా ఆలోచనలకు తగ్గట్లు చేసే అవకాశం లభించినపుడు.. స్వేచ్ఛగా గాల్లో ఎగురుతున్న ఫీలింగ్ కలిగింది. అదే సమయంలో ఎక్కడ కింద పడిపోతామో అన్న భయం కూడా ఉంది.. చివరికి నెగెటివ్ థింగ్స్.. ఫీలింగ్స్ అన్నీ పక్కకు వెళ్లిపోయాయి.. అన్నీ పాజిటివ్ విషయాలే నిలిచిపోయాయి’’ అన్నాడు.

బాహుబలి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ముందే ఎలా ఊహించారు అని అడిగితే.. ‘‘చిన్నప్పట్నుంచి మనకో ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన మనతో పాటే పెరిగి పెద్దవుతుంది. కానీ ఎవరికీ నమ్మకం కలిగించని ఆ ఆలోచన మనం నిజం చేసి చూపించినపుడు.. మన కోరిక నెరవేరినపుడు వచ్చే ఫీలింగ్ ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. బాహుబలి విషయంలో అదే జరిగింది. హ్యూమన్ ఎమోషన్స్ కు సంబంధించి యూనివర్శల్ అనిపించే కథతో సినిమా తీస్తే అది భాష.. ప్రాంతం లాంటి అన్ని హద్దుల్నీ చెరిపేస్తుందని నేను నమ్మాను. బాహుబలి నా ఆలోచనను నిజం చేసింది. అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుని అద్భుత విజయం సాధించింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను’’ అన్నాడు.
Tags:    

Similar News