అంధగాడు రిలీజ్ డేట్ ఇచ్చేశాడు

Update: 2017-03-29 10:42 GMT
యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గతేడాది ఈడోరకం ఆడోరకం మూవీతో హిట్ కొట్టిన రాజ్ తరణ్.. ఆ తర్వాత గెస్ట్ కేరక్టర్లతో పలకరించాడు. ఈ నెల ప్రారంభంలో కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ తన ట్రాక్ ను కంటిన్యూ చేసిన రాజ్ తరుణ్.. అప్పుడే కొత్త సినిమాకి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేయడం విశేషం.

రైటర్ వెలిగొండ శ్రీనివాస్.. దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న సినిమా అంధగాడు. ఈ మూవీలో హీరో పాత్ర అంధుడు కావడమే అసలు సిసలైన స్పెషాలిటీ. పైగా రాజ్ తరుణ్-హేభా పటేల్ ల జంట మరోసారి ప్రేక్షకులను పలకరించనుండడం విశేషం. మే 26న ఈ అంధగాడిని థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు చెప్పేశాడు రాజ్ తరుణ్. అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఇచ్చిన కొత్త పోస్టర్ లో.. విడుదల తేదీ కూడా చెప్పేయడం విశేషం.

రెండు నెలల ముందే డేట్ లాక్ చేసుకోవడంతో.. లాస్ట్ మినిట్ రష్ ను తప్పించుకోవచ్చు. అంధగాడు ఇప్పుడదే చేశాడు. సమ్మర్ చివర్లో సంథింగ్ స్పెషల్ కేరక్టర్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు రాజ్ తరుణ్ ఫిక్స్ అయిపోయాడు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త తర్వాతా.. అనిల్ సుంకర నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న మరో మూవీ కావడంతో.. ట్రేడ్ జనాల్లో కూడా ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News