• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ్ కుంద్రా అరెస్ట్:...

రాజ్ కుంద్రా అరెస్ట్: పూనం షాకింగ్ రియాక్షన్

By - Tupaki Desk
Update: 2021-07-21 06:56 GMT
అశ్లీల వీడియోలు రూపొందించి యాప్ లో పెట్టి అమ్మారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి పూనం పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి. కుంద్రా అరెస్ట్ పై పూనమ్ పాండే ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నా హృదయం శిల్పాశెట్టి, ఆమె పిల్లల గురించే ద్రవిస్తుంది’ అంటూ పూనమ్ ఎమోషనల్ అయ్యింది. ఆమె ఏం చేయాలో నేను ఊహించలేను అని.. 2019లోనే రాజ్ కుంద్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశా.. అతడిపై గౌరవీనయ హైకోర్టులో కేసు పెట్టానని’ పూనం హాట్ కామెంట్స్ చేసింది.

 ఈ విషయం జ్యూడిషియల్ పరిధిలో ఉంది కాబట్టి నేను నా స్టేట్ మెంట్లను ఇక్కడికి పరిమితం చేయడానికి ఇష్టపడుతానని పూనం అన్నారు. అలాగే పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉందని.. అశ్లీల చిత్రాలు తీయడం.. వారిని కొన్ని యాప్ ల ద్వారా ప్రచురించడం నేరం అని  తెలిపారు.

ఈ కేసులో కీలక పాత్రధారులుగా రాజ్ కుంద్రా, అతని టెక్కీ అసోసియేట్ ర్యాన్ జె. తార్పేతో సహా ఇప్పటివరకు కనీసం 12 మందిని పోలీసులు అరెస్టులు చేశారు. వీరిని జూలై 23 వరకు పోలీసు కస్టడీకి ముంబై మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. ఇంతకుముందు అరెస్టయిన తొమ్మిది మందిలో టీవీ నటి గెహ్నా వశిష్ట్,, యాస్మిన్ ఆర్. ఖాన్, , మోను జోషి, ప్రతిభా నాలావాడే,  ఎం. అతిఫ్ అహ్మద్,  దీపాంకర్ పి. ఖాస్నవిస్, భానుసూర్యు ఠాకూర్,  తన్వీర్ హష్మి, , ఉమేష్ కామత్ లు ఉన్నారు.
Tags:    
  • Raj Kundra Arrest 
  • Raj Kundra Films 
  • Raj kundra Case 
  • Shilpa Shetty Husband 
  • Shilpa Setty Husband Films 
  • Raj Kundra Arrest 
  • Raj kundra Arrest News 
  • Raj Kundra News 
  • Shilpa Shetty husband Adult Films 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS