రష్యన్ మహిళను పెళ్లి చేసుకున్న రాహుల్

Update: 2020-12-08 04:03 GMT
దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమారుడు, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ మహాజన్ ట్విస్ట్ ఇచ్చారు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొని తన భార్యను బయటి ప్రపంచానికి చూపించాడు. అది చూసి అంతా షాకయ్యారు. తాజాగా తన మూడో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను రాహుల్ మీడియాతో పంచుకున్నారు.

ఇప్పటికే రాహుల్ కు శ్వేతా సింగ్, డింపి గంగూలీలతో వివాహం అయ్యింది. వారిద్దరూ రాహుల్ పై గృహ హింస కేసులు పెట్టారు. తాజాగా మూడో పెళ్లి చేసుకున్నాడు. బిగ్ బాస్ 8లో ఈయన పార్టిసిపెంట్ గా ఉన్నారు.

రాహుల్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. తామిద్దరం పక్కపక్కనే ఉండే రైల్వే ట్రాక్ లాంటి వారమని.. ఒకరి విషయాల్లో ఒకరం తలదూర్చమని.. అలా అని వేరు వేరు కాదని తెలిపారు. బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.సరైన ట్రాక్ లో వెళుతున్నామని తెలిపారు.  

ఇక బిగ్ బాస్ గురించి చెబుతూ ఇది ముచ్చటగా మూడోసారి అని చెప్పుకున్నారు. ప్రతి ఆరు సీజన్లకు ఓసారి తాను బిగ్ బాస్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బిగ్ బాస్ లో తాజాగా మూడోసారి రాహుల్ పాల్గొంటున్నాడు.
Tags:    

Similar News