ఫస్ట్ డే.. పూరీ డీలా పడిన సందర్భం అదేనట..!

Update: 2020-04-21 08:10 GMT
డైరెక్టర్ పూరి జగన్నాథ్.. హీరోయిజానికి కెరాఫ్ అడ్రెస్. పూరీ సినిమాలో ఏ హీరో నటించినా అలా దూసుకుపోతారంతే. దాదాపు టాలీవుడ్ స్టార్  హీరోలందరితో పూరి సినిమాలు చేశారు. ఏ హీరోకైనా కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. పూరితో సినిమా అంటే అది ప్రత్యేకమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రీ’ని మరిచిపోగలమా ? నువ్ నందా అయితే.. ఏంటీ ? నేను బద్రి.. బద్రీనాథ్ అంటూ పవన్ చెప్పే డైలాగ్.. ఆ డైలాగ్స్ నిన్నటికి ఇరవై ఏళ్ళు నిండాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదటి సినిమాగా.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బద్రి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిన్నటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమా విడుదల రోజు గురించి పూరి స్నేహితుడు రఘు కుంచె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'బద్రి' రిలీజ్ రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి మార్నింగ్ షోకి వెళ్లాము. అక్కడ పవన్ అభిమానుల హడావిడి చూసి హ్యాపీగా ఫీలయ్యాం.

ఇక సినిమా పూర్తయ్యేటప్పటికి మొత్తం వాతావరణమే మారిపోయింది. సినిమా పోయిందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారనీ, నిర్మాత త్రివిక్రమరావు ఫోన్ కూడా తీయడం లేదని పూరి డీలాపడిపోయాడు. అయితే, ఆ మరుసటి రోజు ఒక్కసారిగా సినిమాకి ఆదరణ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ షోలు పడ్డాయి. చిరంజీవి, పవన్ నుంచి పూరికి అభినందనలు వచ్చాయి. నిర్మాత త్రివిక్రమరావు నేరుగా వచ్చి పూరిని హత్తుకున్నాడు. అప్పుడు పూరి చిన్నపిల్లాడిలా గెంతులు వేయడం ఇప్పటికీ నాకు గుర్తు వుంది" అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Tags:    

Similar News