• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దర్శకేంద్రుడు సినిమా కాదు...

దర్శకేంద్రుడు సినిమా కాదు - వెబ్‌ సిరీస్‌!

By - Tupaki Desk
Update: 2018-11-10 07:42 GMT
 శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ మద్య కాలంలో మెగా ఫోన్‌ పట్టుకోవడం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్బుతమైన చిత్రాలను అందించిన రాఘవేంద్ర రావు దర్శకత్వం చేయకపోవడంతో ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మద్య రాఘవేంద్ర రావు ఒక చిన్న చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని - కోటి లోపు బడ్జెట్‌ తో అంతా కొత్త వారితో ఒక చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని, ప్రస్తుతం రాఘవేంద్ర రావు వెబ్‌ సిరీస్‌ ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ప్రస్తుతం చిన్నా - పెద్దా అనే తేడా లేకుండా అంతా కూడా వెబ్‌ సిరీస్‌ లపై పడుతున్నారు. ప్రముఖ నిర్మాతలు - దర్శకులు కూడా వెబ్‌ సిరీస్‌ లను చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఈ సమయంలో రాఘవేంద్ర రావు కూడా ప్రముఖ సంస్థ రిలయన్స్‌ తో కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ ను చేసేందుకు సిద్దమయినట్లుగా సమాచారం అందుతుంది. రిలయన్స్‌ తో రాఘవేంద్ర రావు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడట. అయితే ఆ వెబ్‌ సిరీస్‌ కు దర్శకేంద్రుడు దర్శకత్వం వహిస్తారా లేదంటే తన శిష్యులతో తన పర్యవేక్షణలో తెరకెక్కిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. రాఘవేంద్ర రావు వెబ్‌ సిరీస్‌ ఎప్పుడు ఉంటుంది - ఎలా ఉంటుందనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రాఘవేంద్ర రావు సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే. వెబ్‌ సిరీస్‌ తర్వాత అయినా రాఘవేంద్ర రావు సినిమాను తెరకెక్కిస్తారని ఆశిద్దాం.
Tags:    
  • Raghavendra Rao 
  • Web Series 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS