రఫీ.. ఎస్పీబీ.. బాలయ్య ముందు జూనియర్ ఆర్టిస్టులు
మొహమ్మద్ రఫీ.. ఎస్పీబీ.. బాలయ్య ముందు జూనియర్ ఆర్టిస్టులు!! అంటూ తీసి పారేశారు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ. అంతగా బాలయ్య పాట మైండ్ బ్లాక్ చేసిందా? అంటే.. ఆయన అందుకున్న శాస్త్రీయ గీతం అలాంటిది. క్లాసిక్ `జగదేకవీరుని కథ`లోని `శివ శంకరి .....` అనే పురాణ శాస్త్రీయ గీతాన్ని యూట్యూబ్ చానెల్ సాక్షిగా ఆలపించారు బాలకృష్ణ. ఆయన 60వ బర్త్ డే సందర్భంగా మీడియా ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపేస్తూ ఎంతో ఉల్లాసంగా ఉన్నారు. ఆ క్రమంలోనే మచ్చుకు ఆయన తనలోని గాయకుడిని నిద్ర లేపారు. ప్రస్తుతం ఆయన గానాలాపనపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
క్లాసిక్ సంగీతకారులు అయితే కోపంతో ఊగిపోతున్నారు. పాటపై ఆమాత్రం ఆసక్తి జ్ఞానం ఉన్న నెటిజనులు అయితే సెటైర్లు పంచ్ లు వేసేందుకు వెనకాడడం లేదు. గొప్ప పాటను ఖూనీ చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. సంగీత ప్రియులంతా బాలయ్యలోని గాయకుడిని శపిస్తున్నారు. ఇక ఆర్జీవీ అయితే అలా ఇలా కాదు. ఒక రేంజులోనే చెలరేగిపోయారు తాజా ట్వీట్ లో..
ఆర్జీవీ ఏమని ట్వీట్ చేశాడంటే.. ``వావ్! మొహమ్మద్ రఫీ .. ఎస్.పి.బి పాడటంలో జూనియర్ ఆర్టిస్టుల్లా ఉన్నారు .. అతని ఓదార్పు తో కూడుకున్న భావోద్వేగ గానం.. పల్స్ పెంచేస్తుంది. శ్రోతల హృదయ స్పందనను పెంచుతుంది .ఇది ఒథెల్లో బల్లాడ్.. శంకర శాస్త్రి .. మొజార్ట్ లను మిక్స్ చేసిన అద్భుత సంగీత దృశ్యం`` అంటూ ఎమోషన్ అయిపోయాడు. అయినా ఆర్జీవీ కుళ్లు కానీ.. బాలయ్య పలికించిన గమకాలు ఇంకెవరైనా పలికంచగలరా గురువా? క్లాసిక్ ప్రపంచం నివ్వెరపోయే ఆ గానాలాపన వినాలంటే ఆన్ లైన్ లోకి వెళ్లాల్సిందే సుమీ!!