• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎక్స్‌క్లూసివ్...

ఎక్స్‌క్లూసివ్ :'రాధేశ్యామ్' కోసం రెండు రిలీజ్ డేట్‌లు

By - Tupaki Desk
Update: 2022-01-27 07:31 GMT
కారోనా, ఒమిక్రాన్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు భారీ చిత్రాల రిలీజ్ లు వాయిదా ప‌డ్డాయి. సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తాయ‌ని ప్రేక్ష‌కులు ఆశ‌గా ఎదురు చూసిన `ఆర్ ఆర్ ఆర్‌`, `రాధేశ్యామ్‌` రిలీజ్ లు అర్థాంత‌రంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ, పైగా `బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్ర రిలీజ్ కోసం యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూశారు.

అయితే తాజాగా దేశంలో నెల‌కొన్ని విప‌త్క‌ర పరిస్థితుల కార‌ణంగా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు. ఇదే త‌రహాలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం `రాధేశ్యామ్‌`. ప్ర‌భాస్ న‌టించిన ఈ మూవీపై కూడా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వింటేజ్ ల‌వ్ స్టోరీగా యూర‌ప్ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించిన తీరు, తాజాగా రిలీజ్ చేసిన టీజ‌ర్ లో డావిస్సీ ఓడ‌ని త‌ల‌పించే ఓడ ప్ర‌మాదం, ఇట‌లీ రైల్ మిస్సింగ్ ని త‌ల‌పించే ట్రైన్ ఎపిసోడ్.. డెస్టినీ, ప్రేమ ల స‌మాహారంగా తెర‌కెక్కించిన తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.  

ట్రైల‌ర్ చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ ఇండియ‌న్ స్క్రీన్ పై స‌రికొత్త టైటానిక్ త‌ర‌హా ల‌వ్ స్టోరీగా ఈ మూవీని ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు స‌గ‌టు సినీ ప్రియులు అభివ‌ర్ణించారు. దీంతో ఈ మూవీపై కూడా అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. అయితే జ‌న‌వ‌రి 14న విడుద‌ల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ వైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డింది. `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రాన్ని ఇవే కార‌నాల‌తో వాయిదా వేసిన మేక‌ర్స్ ఈ చిత్ర విడుద‌ల కోసం రెండు రిలీజ్ డేట్ ల‌ని ప్ర‌క‌టించారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న మా చిత్రాన్ని విడుద‌ల చేస్తామంటూ మేక‌ర్స్‌ప్ర‌క‌టించారు. ఇదే త‌ర‌మాలో `రాధేశ్యామ్‌` మూవీ మేక‌ర్స్ ఈ మూవీ రిలీజ్ కోసం రెండు డేట్ ల‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది.

మార్చిలో ఫ‌స్ట్ ఫ్రైడే లేదా సెకండ్ ఫ్రైడే న రిలీజ్ చేయాల‌ని లేదంటే ఏప్రిల్ ఫ‌స్ట్ వీకెండ్ లో ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస‌క్తున్న‌ట్టుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం. అంటే `ఆర్ ఆర్ ఆర్‌` కి ముందే ఈ మూవీని థియేట‌ర్ల‌లోకి తీసుకురావాల‌ని `రాధేశ్యామ్‌` మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. `ఆర్ ఆర్ ఆర్‌` కు క‌నీసం రెండు వారాల ముందు విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

దీంతో రెండు చిత్రాల మ‌ధ్య ఎలాంటి పోటీ వుండే అవ‌కాశం లేద‌ని, క‌లెక్ష‌న్ ల ప‌రంగా కూడా ఎలాంటి ఇబ్బంది వుండ‌ద‌ని `రాధేశ్యామ్` మేక‌ర్స్ ప్లాన్. ఇదే జ‌రిగితే `రాధేశ్యామ్‌` బాక్సాపీస్ వ‌ద్ద అనుకున్న స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయ‌మే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. అంతే కాకుండా గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి  రెండు రిలీజ్ డేట్ లు ప్ర‌క‌టించ‌డం ద్వారా స్ట్రాంగ్ రిప్లై ని ఇవ్వ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇదిలా వుంటే త్వ‌ర‌లోఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయ‌డానికి `రాధేశ్యామ్` మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. రిలీజ్ డేట్ ల‌ని కూడా ఫైన‌ల్ చేయ‌బోతున్న నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ కు మేక‌ర్స్ ఏర్పాట్లు చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అంటే గ‌త కొన్ని రోజులుగా  స‌రైన ట్రీట్ కోసం ఎదురుచూస్తున్న‌ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ట్రైల‌ర్ తో స‌ర్ ప్రైజింగ్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌న్న‌మాట‌.
Tags:    
  • Radheshyam 
  • RRR 
  • tolly wood 
  • Latest news 
  • Tupaki Updates 
  • telugu news 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS