• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ బర్త్ డే స్పెషల్...

ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా 'రాధే శ్యామ్' టీజర్!

By - Tupaki Desk
Update: 2021-10-18 03:15 GMT
'బాహుబలి' సినిమా నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఆ సినిమాతో ఆయన మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తరువాత చేసిన 'సాహో' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయినా, అది ఆయన కెరియర్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తరువాత కూడా ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలను పట్టాలెక్కిస్తూ వెళుతున్నాడు. అలాంటి సినిమాలలో ముందుగా 'రాధే శ్యామ్' థియేటర్లకు రానుంది. 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి ఇంతవరకూ మరో సినిమా రాలేదు. అందువలన 'రాధేశ్యామ్' కోసం అంతా వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ వారు .. టి సిరీస్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రభాస్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. పునర్జన్మలతో ముడిపడి ఈ ప్రేమకథ కొనసాగుతుంది. ప్రభాస్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. పాటల కోసమే కోట్ల రూపాయలను గుమ్మరించారు. ప్రతి పాట తెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని నిర్మాతలు చెప్పడంతో మరింతగా ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

అలాంటి ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్లు అభిమానుల్లో మరింత ఉత్సాహన్ని పెంచుతూ వస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందువలన ఇక నెమ్మదిగా ప్రచార చిత్రాలను వదిలే ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ - పూజ హెగ్డే పాత్రలపై ఫోకస్ చేస్తూ కట్ చేసిన టీజర్ ను వదలనున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడానికి ఇదే తొలి మెట్టుగా భావించి గట్టిగానే కసరత్తు చేసి మరీ కట్ చేశారట.

ఈ టీజర్ తరువాత అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఇక ఇక్కడి నుంచి పెద్దగా గ్యాప్ లేకుండా ఈ సినిమా నుంచి అప్ డేట్లు రానున్నాయని అంటున్నారు. ఇక సంక్రాంతి వరకూ ఈ సందడి పెరుగుతూ పోతుందన్న మాట. కృష్ణంరాజు .. భాగ్యశ్రీ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, ప్రభాస్ ఒక వైపు నుంచి 'సలార్' షూటింగును .. మరో వైపున 'ఆది పురుష్' షూటింగును పరుగులు తీయిస్తున్నాడు. ఆ తరువాత , మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. 'బాహుబలి'తో మొదలైన ప్రభాస్ దండయాత్ర ఇప్పట్లో ఆగేట్టయితే కనిపించడం లేదు.
Tags:    
  • Radhe Shyam 
  • Prabhas birthday special 
  • Prabhas 
  • Tollywood 
  • Actor 
  • latest news 
  • Movie News 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS