• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #రాధేశ్యామ్‌.. ఫోటో...

#రాధేశ్యామ్‌.. ఫోటో ట్రీట్ స‌రే రిలీజ్ ఎపుడు?

By - Tupaki Desk
Update: 2022-01-11 06:30 GMT
సంక్రాంతి బ‌రి నుంచి ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీ వైదొల‌గ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి - సాహో త‌ర్వాత ఒక డిఫ‌రెంట్ ఫీల్ గుడ్ ల‌వ్ సినిమాలో ప్ర‌భాస్ ని చూడాల‌ని ఆశ‌ప‌డిన అభిమానుల‌కు త‌మ ఆశ నెర‌వేరలేదు. ఇది అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుండ‌డంతో నెటిజ‌నుల్లో అస‌హ‌నం వ్య‌క్త‌మైంది.

అయితే దీనికి చికిత్స చేయ‌డం ఎలానో రాధేశ్యామ్ ద‌ర్శ‌కుడికి తెలుసు. తాజాగా అత‌డు రిలీజ్ చేసిన ఆన్ లొకేష‌న్ మేకింగ్ ఫోటోలే అందుకు సాక్ష్యం. రాధేశ్యామ్ ను వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేకపోవడంతో దర్శకుడు రాధా కృష్ణ కుమార్ నిజంగా ఆందోళన చెందాడు. ఈ సీజ‌న్ కఠినంగా మారింద‌ని ప్ర‌జ‌లు అల్లకల్లోలంగా ఉన్నారని అన్నారు. అయినప్పటికీ ఆశలు చెక్కుచెదరలేదని ఆయన అన్నారు. డార్లింగ్ ప్రభాస్ తో తాను పూజా క‌లిసి ఉన్న కొన్ని ఫోటోల‌ను తాజాగా రిలీజ్ చేసారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే రాధే శ్యామ్ కేవలం నాలుగు రోజుల్లోనే భారీ విడుదలకు సిద్ధమయ్యేది. కానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. అందుకే నిరాశ చెందిన అభిమానుల కోసం ఈ ప్ర‌త్యేక ఫోటోలు అని అర్థ‌మ‌వుతోంది. అభిమానులను ఉత్సాహపరచడానికి తన వంతు ప్రయత్నం చేసారు రాధాకృష్ణ‌. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

చారల చొక్కాతో ప్రభాస్.. త‌న చెంత‌నే ఉండి సీన్ ని వివ‌రిస్తూ రాధాకృష్ణ కుమార్ ఓ ఫోటోలో క‌నిపించ‌గా.. వేరొక ఫోటోలో పూజాకు కూడా సీన్ ని వివ‌రిస్తూ ద‌ర్శ‌కుడు క‌నిపించాడు. పూజా హెగ్డే రైలులో సన్నివే శం గురించి చర్చిస్తున్న ఫోటో ఆక‌ట్టుకుంది. అయితే ఈ ఫోటోలు వీక్షించాక అభిమానులు అస‌లే ఆగ‌లేకున్నారు. రాధేశ్యామ్ రిలీజ్ తేదీ ఎప్పుడో చెప్పాల్సిందిగా కోరుతున్నారు. త్వరలో జరగనున్న కొత్త విడుదల తేదీపై మేకర్స్ ప్రకటన చేస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 1980ల నాటి యూర‌ప్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమ్ ఆదిత్యగా న‌టిస్తుండ‌గా.. పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టీసిరీస్ హిందీలో రిలీజ్ చేస్తోంది.
Tags:    
  • radhe shyam 
  • radhe shyam trailer 
  • radhe shyam release date 
  • radhe shyam songs 
  • radhe shyam promos 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS