• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పండగ కోసం ఓ పాట పాడేసిన...

పండగ కోసం ఓ పాట పాడేసిన రాశి

By - Tupaki Desk
Update: 2019-12-05 07:01 GMT
టాలీవుడ్ లో మల్టి టాలెంటెడ్ అనిపించుకునే హీరోలు హీరోయిన్లు చాలామందే ఉన్నారు.  అలాంటి లిస్టులో బ్యూటిఫుల్ రాశి ఖన్నా కూడా ఉంది. రాశి జస్ట్ నటి మాత్రమే కాదు అప్పుడప్పుడు గొంతు సవరించుకుని పాటలు పాడుతుంది.  ఏదో పాడాం అంటే పాడాం అన్నట్టు కాకుండా నిజమైన సింగర్ లాగా ప్రయత్నం చేస్తుండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

రాశి ఇప్పటి వరకూ నాలుగు పాటలు పాడింది.  మొదటి సారిగా 'జోరు' సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది. తర్వాత 'బాలకృష్ణుడు' సినిమా లో మరో పాట పాడింది.  సాయి ధరమ్ తేజ్ 'జవాన్' లో 'బంగారూ' అంటూ సాగే మరో పాటను పాడి సంగీత ప్రియులను మెప్పించింది.  మలయాళంలో 'విలన్' సినిమాకు ప్రమోషన్ సాంగ్ పాడింది. ఇదిలా ఉంటే తాజాగా రాశి మరోసారి సింగర్ అవతారం ఎత్తింది.  సాయి ధరమ్ తేజ్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ప్రతిరోజూ పండగే' సినిమాకోసం ఒక పాట పాడింది. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.  వరసగా హిట్ సాంగ్స్ వదులుతూ మంచి జోరు మీద ఉన్న థమన్ ఈసారి రాశి ఖన్నా కోసం ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో తెలియాలంటే వేచి చూడకతప్పదు.  

సినిమాల విషయానికి వస్తే రాశి నటించిన రెండు సినిమాలు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందు లో ఒకటి 'వెంకీమామ' కాగా మరొకటి 'ప్రతిరోజూ పండగే'.  ఈ సినిమాలు కాకుండా విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    
  • Raashi Khanna Singer 
  • Prathi Roju Pandage Trailer 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS