• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రేజీ రాశీ.. ఆ ఛాన్స్...

క్రేజీ రాశీ.. ఆ ఛాన్స్ ఎక్క‌డ అమ్మ‌డూ?

By - Tupaki Desk
Update: 2020-01-09 09:11 GMT
అందం.. అభిన‌యం వీట‌న్నిటినీ మించి ల‌క్ క‌లిసొచ్చిన‌ భామ‌ రాశీ ఖ‌న్నా. ఆరంభం బాలీవుడ్ లో న‌టించినా టాలీవుడ్ లో స‌రిగ్గా కెరీర్ ని సెట్ చేసుకోవ‌డంలో పెద్ద స‌క్సెసైంది. కెరీర్ ప్రారంభించి ఐదేళ్ల‌కు పైగానే గ‌డిచిపోయినా... ఇన్నేళ్ల కెరీర్ లో భారీ విజ‌యాలు ఉన్నాయా? అంటే లేనే లేవ‌ని చెప్పాలి. ఇటీవ‌లే ఊహించ‌ని విధంగా కంబ్యాక్ అయ్యింది. వెంకీమామ‌- ప్ర‌తిరోజు పండగే చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు అందుకుంది. అయితే ఆ సక్సెస్ త‌న‌కు క‌లిసొచ్చిందా? అంటే.. క్రేజ్ పెరిగిందే కానీ ఛాన్సులు ఒక్క‌టీ కూడా లేవ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ లో న‌టిస్తోంది. ఇందులో రాశీ కి  పోటీగా మ‌రో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లున్నారు.


కాబ‌ట్టి రాశీ పాత్ర ఎలివేట్ అయ్యే అవ‌కాశం పెద్ద‌గా లేదు. ఒక సినిమాలో ముగ్గురు న‌లుగురు హీరోయిన్లు ఉంటే.. న‌లుగురిలో త‌న‌కు ద‌క్కే ప్రాధాన్య‌త ఎంత అన్న‌ది చూడాలి. కాబ‌ట్టి ఫేమ‌స్ ల‌వ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా రాశీకి ఓరిగేదేమి పెద్ద‌గా ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగులో మ‌రో ప్రాజెక్ట్ కు సంత‌కం చేసిన దాఖ‌లాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అలాగ‌ని పొరుగున అయినా ఛాన్సులేవైనా ఉన్నాయా? అంటే అదీ లేదు. త‌మిళ్ లోనైనా బిజీగా ఉందా? అంటే అక్క‌డ ఇంత‌క‌న్నా ఘోరంగా ఉంది కెరీర్. ప్ర‌స్తుతం అక్క‌డా సైతాన్ కా బ‌చ్చా అనే ఒకే ఒక్క‌ సినిమాలో న‌టిస్తోంది. ఇది పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమా కాదు. సిద్దార్థ్ హీరోగా న‌టిస్తున్నాడు.


సిద్ధార్థ్ మంచి స‌క్సెస్ తో కంబ్యాక్ అవ్వాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నా..అవి ట్ర‌య‌ల్స్ గానే మిగిలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాపై రాశీ ఆశ‌లు పెట్టుకున్నా! క‌లిసొచ్చే సినిమా అయితే కాదని ముందే తేలి పోయింది. పైగా ఈ సినిమా షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. ఆ ర‌కంగా రాశీని ఇంకా బ్యాడ్ టైమ్ వెంటాడుతున్న‌ట్లే క‌నిపిస్తోంది. రెండు వ‌రుస విజ‌యాలు త‌ర్వాత ఏ హీరోయిన్ అయినా బిజీ అవుతుంది. కానీ అందాల రాశీకి మాత్రం ఇంకా క‌లిసొచ్చే స‌మ‌యం రాలేద‌నే అర్థ‌మ‌వుతోంది. మ‌రి స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్సులు ద‌క్కే యోగం ఉందా లేదా? క్రేజీ ఛాన్సులందుకుని కెరీర్ ని ఎప్ప‌టికి ప‌రుగులు పెట్టిస్తుందో చూడాలి.
Tags:    
  • Raashi Khanna to Work with Siddharth in Upcoming Flick 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

లుక్ టెస్ట్ - ఆడిష‌న్ లేకుండానే ఛాన్సిచ్చారు- రేణు దేశాయ్

2026-11-17 06:51 GMT

క్యాస్టింగ్ కౌచ్ ఉంది..దీనికి లింగభేదం లేదు!

2026-11-17 06:51 GMT

కిర్రాక్ ఫోజ్.. అలా చూస్తే కుర్రకారు తట్టుకుంటారా పూజా?

2026-11-17 06:51 GMT

రెయిన్బో కలర్స్ లో కొంటెగా కవ్విస్తున్న శూర్పణఖ!

2026-11-17 06:31 GMT

100వ సినిమా హడావిడి ఇంతేనా?

2026-11-17 06:31 GMT

జెన్-జీ బిజినెస్ మంత్రను బయటపెట్టిన ఖుషి కపూర్!

2026-11-17 06:30 GMT

శ్రీలీలతో గొడవల వల్లే ఆ నిర్మాత దూరం..!

2026-11-17 06:05 GMT

ఆరు నెలల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ మూడు సినిమాలు సాధ్యమా?

2026-11-17 06:05 GMT

'టూరిస్ట్ ఫ్యామిలీ' మేకర్స్.. మనోడిపై కన్నేశారేంటి?

2026-11-17 06:05 GMT

ఏంటీ.. డైరెక్టర్ నెల్సన్ తొలి సినిమా కథ దొంగలించబడిందా?

2026-11-17 05:40 GMT

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

2026-11-17 05:39 GMT

మెగాస్టార్ 'మెగావర్స్'లో తమిళ్ మెగా బ్రదర్..!

2026-11-17 05:38 GMT

Copyright @2026

Powered by Blink CMS