• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏంటీ.. డైరెక్టర్ నెల్సన్...

ఏంటీ.. డైరెక్టర్ నెల్సన్ తొలి సినిమా కథ దొంగలించబడిందా?

| నెల్సన్ దిలీప్ కుమార్ 2010లో తెరకెక్కించిన ‘వెట్టై మన్నన్’ సినిమా కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా ఆగిపోయిందని ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి వెల్లడించారు. సినిమా టీజర్ కూడా సిద్ధమైందని, కథ ఉన్న ల్యాప్‌టాప్‌ను కారులో నుంచి దొంగిలించడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయిందని తెలిపారు. దీంతో నెల్సన్ మరో కథతో 2018లో దర్శకుడిగా పరిచయమయ్యారు.

By - Madhu Reddy
Update: 2026-11-17 05:40 GMT

కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన టేకింగ్ విజన్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన డైరెక్టర్ మాత్రమే కాదు స్క్రీన్ రైటర్ కూడా.. పైగా బ్లడీ బర్గర్ అనే చిత్రంతో నిర్మాతగా కూడా మారారు. ఈయన కెరియర్ విషయానికి వస్తే 2010లో 'వెట్టై మన్నన్' అనే చిత్రంతో తన కెరియర్ ను ప్రారంభించిన నెల్సన్.. పలు కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది. కానీ 2018లో అంటే దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 'కోలమావు కోకిల' అనే సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రాన్ని తెలుగులో 'కోకోకోకిల ' అనే సినిమా పేరిట డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్ నుండి ఆదరణ లభించలేదు. కానీ 2021 లో వచ్చిన డాక్టర్ సినిమా తెలుగులో వరుణ్ డాక్టర్ పేరిట రిలీజ్ చేసి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

అయితే నెల్సన్ కి భారీ పాపులారిటీ లభించింది మాత్రం జైలర్ మూవీ తోనే అనే చెప్పాలి. ఈ చిత్రంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు రజనీకాంత్ పనైపోయింది.. ఇక ఇంటికి వెళ్లే సమయం వచ్చింది అని ఎంతోమంది ఆయనను విమర్శిస్తున్న సమయంలో ఆయనకంటూ ఒక మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించి ఆయనను మళ్ళీ నిలబెట్టిన చిత్రం కూడా ఇదే. అలా ఈ చిత్రంతో అటు రజనీకాంత్ కి ఇటు నెల్సన్ కి ఊహించని పాపులారిటీ లభించింది. దీనికి తోడు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన జైలర్ 2 చిత్రం కూడా అంతే స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం రజినీకాంత్, కమలహాసన్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించబోతున్నారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇద్దరు బడా హీరోలుగా కొనసాగుతున్న కమలహాసన్, రజినీకాంత్ కలయికలో సినిమా రాబోతోందని తెలిసి ప్రతి ఒక్కరి అంచనాలు ఈ సినిమా పైనే ఉన్నాయి . ఇక ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పై నెల్సన్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న నెల్సన్ గురించి ఆయన స్నేహితుడు 'అమరన్' డైరెక్టర్ రాజకుమార్ పెరియస్వామి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

2010లోనే సినిమా ఇండస్ట్రీలోకి రావాల్సిన నెల్సన్ ఎనిమిదేళ్లు ఆలస్యంగా 2018లో అడుగుపెట్టడానికి గల కారణం ఏమిటి? ముఖ్యంగా ఆయన తెరపైకి తీసుకురావాల్సిన కథ ఏమయింది ? ఎందుకు ఆగిపోయింది? ఇలా అన్ని విషయాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజ్ కుమార్ పెరియస్వామి మాట్లాడుతూ.. "వెట్టై మన్నన్ అనే టైటిల్ తో 2010లోనే నెల్సన్ ఒక అద్భుతమైన కథను తయారు చేసుకున్నాడు. పైగా ఇందులో స్టార్ నటీనటులు కూడా భాగమయ్యారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. 10 రోజులు షూట్ చేస్తే సినిమా పూర్తి అయ్యేది. పైగా అద్భుతమైన టీజర్ ని కూడా కట్ చేశాడు. దానికి నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమా చివరి దశలో ఉండగా దానిని ఒక ల్యాప్ టాప్ లోకి ఎక్కించాడు. అయితే ఆ ల్యాప్ టాప్ తీసుకొని ఆఫీస్ కి వస్తుండగా.. ట్రాఫిక్ కారణంగా కారు ఆపాడు. సడన్గా కారులో ఉన్న ల్యాప్ టాప్ ను ఎవరో దొంగలించారు. అలా కథ మొత్తం దొంగిలించబడింది. ఇక చివరి దశకు చేరుకున్న సినిమా కథ పోగొట్టుకోవడం వల్ల.. ఆ కథ ప్రేక్షకుడి ముందుకి రాలేదు. దాదాపు 8 ఏళ్ల శ్రమ తర్వాత మళ్లీ మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు" అని తెలిపారు రాజకుమార్ . ఏది ఏమైనా నెల్సన్ లాంటి స్టార్ డైరెక్టర్ కథను పోగొట్టుకున్నాడని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • nelsondilipkumar 
  • vettaimannan 
  • rajinikanth 
  • jailer2 
  • rajkumarpandian 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS