కిర్రాక్ ఫోజ్.. అలా చూస్తే కుర్రకారు తట్టుకుంటారా పూజా?
| పూజా హెగ్డే తాజాగా పీచ్ పింక్ టిష్యూ సిల్క్ చీరలో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొలంబోలో జరిగిన స్టోర్ ప్రారంభోత్సవం కోసం ఈ లుక్‌ను ఎంచుకుంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్, ముత్యాలు, కుందన్ల చోకర్ నెక్లెస్‌తో సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’, ‘కాంచన 4’, ‘శంకీ’ సినిమాల్లో నటిస్తోంది.
ఇటీవల కాలంలో హీరోయిన్లు తమ గ్లామర్ తోనే కాదు సినిమాటిక్ లెవెల్ లో ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మలు.. అరుదైన ఫోజులతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా ఆ క్రేజీ క్యాప్షన్లు జోడిస్తూ మరింత వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు బుట్ట బొమ్మగా ప్రేక్షకులను అలరించి.. ఇప్పుడు తనదైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే తాజాగా షేర్ చేసిన ఒక్క ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
అందం, అభినయంతో మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకే ఒక్క ఫోటో షేర్ చేస్తూ ఇలా క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది." షూటింగ్ కి బయలుదేరేముందు ఆఖరి సారిగా అలా చూసుకుంటే".. అంటూ కొంటెగా ఎమోజిని షేర్ చేసింది పూజా హెగ్డే. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ పిక్ లో పూజా హెగ్డే టిష్యూ సిల్క్ చీర కట్టుకొని దీనికి కాంబినేషన్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఒక స్టోర్ ప్రారంభోత్సవ వేడుక కోసం ఈ లుక్ ను ఎంచుకుంది పూజా హెగ్డే.
పీచ్ - పింక్ షేడ్ టిష్యూ సిల్క్ చీరకి అంచుల వెంబడి బంగారు రంగు సీక్విన్స్, కట్టాదాన అలాగే పూసలతో కూడిన సున్నితమైన స్కాలప్ ఎంబ్రాయిడరీ బోర్డర్ తో డిజైన్ చేశారు ముదురు షేడ్ లో ఉన్న కోరల్ పీచ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ఈమె ధరించింది. బ్లౌజ్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో డీప్ నెక్, సన్నని డోరీ తో డిజైన్ చేశారు. మొత్తం ఈ అవుట్ ఫిట్ ను ఆమె ఫుల్ ఫిల్ చేసుకోవడానికి మెడలో ముత్యాలు, కుందన్లతో డిజైన్ చేసిన చోకర్ నెక్లెస్ ను ధరించింది. షోల్డర్ వరకు హెయిర్ కట్ తో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది పూజై హెగ్డే. మొత్తానికైతే ఈ ఒక్క లుక్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. నువ్వు కొంటెగా అలా ఫోజులిస్తే మా మనసులు తట్టుకుంటాయా సఖి అంటూ కవిత్వాలు వళ్ళుతున్నారు.
పూజా హెగ్డే ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పూజా హెగ్డే.. ఆ తర్వాత భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న శ్రీశ్రీ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన తమిళ్ హార్రర్ కామెడీ ఫ్రాంచైజీ కాంచన 4 లో కూడా ఈమె భాగమైంది. అలాగే అహాన్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ యాక్షన్ రొమాంటిక్ శంకీ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది . ఇవన్నీ కూడా మంచి విజయాలను అందుకొని ఈమెకు మళ్ళీ మునుపటి వైభవాన్ని అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.