• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీలీలతో గొడవల వల్లే ఆ...

శ్రీలీలతో గొడవల వల్లే ఆ నిర్మాత దూరం..!

| తెలుగులో అవకాశాలు తగ్గుతున్న శ్రీలీలకు తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన కెరీర్, కథల ఎంపికపై ఆమె మాట్లాడారు. ఇదే వేడుకలో నిర్మాత నాగవంశీ తనకు, శ్రీలీలకు మధ్య గొడవలు ఎక్కువయ్యాయని సరదాగా వ్యాఖ్యానించారు. తన సినిమాల్లో ఆమెకు అవకాశాలు తగ్గడానికి ఇదే కారణమన్నట్లుగా మాట్లాడటంతో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-17 06:05 GMT

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా కనిపించిన హీరోయిన్ శ్రీలీల. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అయితే ఈ మధ్య.. ఈ హీరోయిన్ కి తెలుగులో సినిమాలో అవకాశాలు తాగుతుండగా..తమిళంలో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతునాయి.

శ్రీలీల హైదరాబాద్‌లో జరిగిన ఓం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ కార్యక్రమంలో ఆమె తన సినీ ప్రయాణం గురించి మాట్లాడింది. కెరీర్ ప్రారంభంలో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించానని చెప్పింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయని..వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేశానని వివరించింది.

అయితే కొంత సమయం తీసుకుని తన కెరీర్ గురించి ఆలోచించిన తర్వాత కొన్ని విషయాలు అర్థమయ్యాయని శ్రీలీల తెలిపింది. ఏ సినిమా చేయాలి, ఎలాంటి కథను ఎంచుకోవాలి అనే నిర్ణయాలు మనమే తీసుకోవాలని చెప్పింది.

మరోవైపు ఇదే వేడుకలో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. శ్రీలీల గురించి మాట్లాడుతూ తనకు, ఆమెకు మధ్య గొడవలు ఎక్కువయ్యాయని సరదాగా వ్యాఖ్యానించారు. అందుకే తన సినిమాల్లో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయనే అర్థం వచ్చేలా మాట్లాడారు. సాయి అభ్యంకర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ తనకు బాగా నచ్చిందని నాగవంశీ చెప్పారు. ముఖ్యంగా మేకప్ లేకుండా శ్రీలీల కనిపించిన తీరు చాలా బాగుందని వెల్లడించారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన కింగ్డమ్, లెనిన్ సినిమాలకు మొదట శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టుల్లో ఇతర హీరోయిన్లు కనిపించారు. ఇప్పుడు నాగవంశీ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయాలు మరోసారి ఆసక్తిని పెంచాయి.

Tags:    
  • sreeleela 
  • nagavamsi 
  • ommovie 
  • tollywood 
  • telugucinema 

Similar News

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

2026-11-19 07:55 GMT

Copyright @2026

Powered by Blink CMS