• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాశి ఖన్నాకు తమిళంలో...

రాశి ఖన్నాకు తమిళంలో బంపరాఫర్

By - Tupaki Desk
Update: 2018-03-21 07:50 GMT
రాశి ఖన్నా కెరీర్‌ను ‘తొలి ప్రేమ’కు ముందు.. ‘తొలి ప్రేమ’కు తర్వాత అని విభజించి చూడాలేమో. ఈ సినిమా ముందు వరకు ఆమెను అందరూ లైట్ తీసుకునేవాళ్లు. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ క్యారెక్టర్లు చేసే సగటు కథానాయికగానే చూసేవాళ్లు జనాలు ఆమెను ఇంతవరకూ. ఐతే ‘తొలి ప్రేమ’ సినిమాతో తానెంత మంచి పెర్ఫామరో రుజువు చేసింది రాశి. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలే వస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆమెకు తమిళంలో ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘టెంపర్’ను తమిళంలో విశాల్ కథానాయకుడిగా రీమేక్ చేయబోతున్నట్లు ఎప్పుడో సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో రాశినే కథానాయికగా ఎంపికైంది. మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమాకు మురుగదాస్ దగ్గర కో డైరెక్టర్‌ గా పని చేసిన వెంకట్ మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. విశాల్ సొంత బేనర్.. లైట్ హౌజ్ మూవీ మేకర్స్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. రాశి ఇప్పటికే తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తుండటం విశేషం. అధర్వ.. సిద్దార్థ్.. జయం రవిల సరసన ఆమె కథానాయికగా సినిమాలు చేస్తోంది. అధ్వర్వకు జోడీగా నటించే సినిమాలో నయనతార కూడా ఓ కీలక పాత్ర చేస్తుండటం విశేషం. తెలుగులో ఆమె కొత్తగా రెండు సినిమాలకు సంతకం చేసినట్లు సమాచారం.
Tags:    
  • Raashi Khanna 
  • Temper Tamil Remake 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS