• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరో గెస్ట్ హౌస్ కొన్న...

హీరో గెస్ట్ హౌస్ కొన్న రాశీఖన్నా!

By - Tupaki Desk
Update: 2016-09-24 13:06 GMT
తమిళంలో 2013లో విడుదలయిన మద్రాస్ కేఫ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, తర్వాత ఏడాది ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన హీరోయిన్ రాశీఖన్నా. ఈ సినిమా అనంతరం వచ్చిన తన ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో మెప్పిస్తూ, అందివచ్చిన అవకాశాలను సక్రమంగా వాడుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో మంచి హిట్లనే తన ఖాతాలో వేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్న రాశీ అటు టాలీవుడ్ - ఇటు కోలీవుడ్ లలో మంచి మంచి ఆఫర్లనే దక్కించుకుంటుంది. అయితే తాజాగా రాశీఖన్నా కు సంబందించిన ఒక హాట్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే.. ఆమె ఒక హీరో గెస్ట్ హౌస్ ను కొన్నదట!

రాశీఖన్నా హైదరాబాద్ లో ఒక గెస్ట్ హౌస్ ను కొనుగోలు చేసిందని, అది కూడా ఒక హీరోకి సంబందించిందని వార్తలొస్తున్నాయి. సినీ రంగప్రవేశం చేసింది కోలీవుడ్ లో అయినా ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఆఫర్లు బాగా పెరుగుతుండడంతో ప్రతిసారీ హోటల్స్ లో ఉండడం ఇబ్బంది అవుతోందట రాశీకి. ఇదే సమయంలో టాలీవుడ్ హీరో ఒకరు తన గెస్ట్ హౌస్‌ ను అమ్మకానికి పెట్టాడంతో.. అదే గెస్ట్ హౌస్‌ ను ఆమె కొనుగోలు చేసిందని ఫిల్మ్‌ నగర్ వర్గాల సమాచారం.

మరో విషయం ఏమిటంటే.. ఇప్పటికే చెన్నై - ముంబైల్లో ఇళ్లను కొనుగోలు చేసిన రాశీఖన్నా తాజాగా ఆ హీరో గెస్ట్‌ హౌస్‌ ను సింగిల్ డీల్‌ లోనే కొనేసిందట. అన్నీ అనుకూలంగా కుదిరితే మరికొన్ని రోజుల్లోనే గృహప్రవేశం కూడా చేయనున్న ఈ అందాలరాశి ఒక హైదరాబాద్ లో కూడా ఒక ఇంటి ఓనర్ అయిపోయిందన్న మాట!! కాగా, ప్రస్తుతం రామ్‌ తో హైపర్ నటిస్తున్న రాశీఖన్నా, మరో రెండు సినిమాలకు ఇప్పటికే సైన్ చేసిందని అంటున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Raashi Khanna 
  • Guest House 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS