• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజినీ విశ్వరూపాన్ని...

రజినీ విశ్వరూపాన్ని చూపించిన 'రా సామీ' సాంగ్..!

By - Tupaki Desk
Update: 2021-10-29 04:00 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా తమిళ దర్శకుడు శివ రూపొందించిన తాజా చిత్రం 'అన్నాత్తే'. తెలుగులో ''పెద్దన్న" అనే టైటిల్ తో విడుదల కానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఏషియన్ సినిమాస్ నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ అంటూ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశారు. ఈ క్రమంలో తాజాగా ‘రా సామీ’ అనే పవర్ ఫుల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

'జుట్టే దొరకబట్టు.. పట్టా దులిపి కొట్టు.. చెట్టు మీద దెయ్యాలన్నీ కాలి కూలి పోవాలా..' అంటూ సాగిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. డబ్బింగ్ సాంగ్ కాబట్టి దానికి తగినట్లుగా లిరిక్స్ రాసినట్లు తెలుస్తోంది. ఈ గీతానికి డి. ఇమ్మాన్‌ స్వరాలు సమకూర్చారు. సింగర్ ముఖేష్ ఎంతో హుషారుగా ఆలపించారు. ఈ పాట సినిమాలో రజినీ కాంత్ పాత్రను ఎలివేట్ చేసేలా.. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో అలరిస్తోంది. ఇందులో రజనీ పంచె కట్టులో ఇంటెన్స్ అండ్ మాస్‌ లుక్‌ లో ఆకట్టుకున్నారు.

'పెద్దన్న' చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్‌ పంచాయతీ పెద్ద వీరన్నగా నటించారు. ఆయనకు జోడీగా నయనతార.. సోదరిగా కీర్తి సురేశ్‌ కనిపించనున్నారు. ఖుష్బూ - మీనా - జగపతి బాబు - ప్రకాశ్‌ రాజ్‌ - సూరి - అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషించారు. వెట్రి పలనిస్వామి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ కంపోజ్ చేశారు. యాక్షన్‌ - కామెడీతో పాటుగా భావోద్వేగాలు కలబోసిన ఈ సినిమా ఎలాంటి విజయం సాదిస్తుందో చూడాలి.
Full View
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS