రా..వన్ యానిమేటర్ చనిపోయింది

Update: 2017-01-19 05:25 GMT
షారూక్ ఖాన్ మూవీ రా..వన్ చిత్రం ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ పొందలేక పోయింది. 2012లో విడుదలైన ఈ చిత్రాన్ని ఆడియన్స్ తిరస్కరించారు. స్టోరీ పరంగా బోలెడన్ని లోపాల కారణంగా పరాజయం పాలైనా.. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నతీరును ఎవరూ మరిచిపోలేరు.

ఆ ఏడాది బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కు గాను జాతీయ అవార్డును కూడా అందుకుంది రా..వన్. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అందించిన వ్యక్తి పేరు చారు ఖాందాళ్. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన చారు ఖాందాళ్.. జనవరి 17 మరణించింది. 32 ఏళ్ల పిన్న వయసులోనే ఈ ట్యాలెంటెడ్ టెక్నీషియన్ మరణించడం బాలీవుడ్ ని కుదిపేసింది. 2012లో ఈమె ఒక యాక్సిడెంట్ కు గురయింది. ఈమె ప్రయాణిస్తున్న ఆటోను.. ఓ కారు అమితమైన వేగంతో ఢీ కొట్టడంతో.. అప్పుడే తీవ్రవగాయాల పాలయ్యాయి.

తలకు.. వెన్నుకు గాయలు కావడంతో పక్షవాతం కూడా వచ్చింది. ఆ గాయాల కారణంగా.. ఇప్పటివరకూ మృత్యువుతో పోరాడిన చారు ఖాందాళ్.. తుదిశ్వాస విడిచేసింది. దీంతో షారూక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఆమె మరణానికి ఘన నివాళి ప్రకటించింది. 'తను చేసే పని ఎంతో ప్యాషన్ ఉన్న ఆమె.. తన వర్క్ తో మ్యాజిక్ చేసేసింది' అని చెబుతూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు రెడ్ చిల్లీస్ వర్గాలు తెలిపాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News