2021 ఇండియా స్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా 'పుష్ప ది రైజ్'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప` ది రైజ్ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా `పుష్ప` రైజింగ్ మాత్రం తగ్గలేదు. స్టిల్ పుష్ప వేవ్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఏపీలో టిక్కెట్ రేట్లు...థియేటర్ల నిర్వహణలో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ మిగతా ఏరియాల్లో మాత్రం భారీ వసూళ్లను సాధించింది. కోలీవుడ్ లో ఈ మాస్ కంటెంట్ మంచి ఆదరణ లభించింది. సాధారణంగా తెలుగు హీరోల సినిమాలు కోలీవుడ్ కి ఎక్కడం కష్టం. కానీ సుకుమార్ తన మార్క్ తో అక్కడి ఆడియన్స్ ని ఫిదా చేసాడు.
ఇంకా మలయాళం..కన్నడ భాషల్లోనూ మంచి లాభాలు వచ్చాయి. హిందీలో రెండు..మూడు రోజులపాటు థియేటర్లు వెలవెల బోయినా అక్కడా అనూహ్యంగా వసూల్లు పుంజుకున్నాయి. ఒకానొక దశలో హిందీ సినిమాలకే పుష్ప పోటీగా నిలిచింది. మొత్తంగా పుష్ప పార్ట్ -1 అనుకున్నది సాధించింది. దీంతో యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. తాజాగా 2021 ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ అంటూ ఓ పోస్టర్ ని కూడా పీఆర్ టీమ్ రిలీజ్ చేసింది. మాసివ్ బ్లాక్ బస్టర్ గా పేర్కొంటూ ప్రేక్షకుల్లోకి పోస్టర్ ని వదిలారు. అయితే గ్రాస్ ఫిగర్ ని మాత్రం లీక్ చేయలేదు. టెక్నికల్ రీజన్స్ గానే టీమ్ ఇలా చేసి ఉండొచ్చు.
ప్రస్తుతం పుష్ప పార్ట్ -2 షూటింగ్ జరుగుతుంది. అన్ని పనులు పూర్తిచేసి మార్చిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అప్పటివరకూ మొదటి భాగం సక్సెస్ ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన నటించింది. సినిమాకి రష్మిక పాత్ర పెద్ద అస్సెట్ గా నిలిచింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించడగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.