ముంబైలో పూరి స్కెచ్ మామూలుగా లేదుగా!

Update: 2020-05-24 04:30 GMT
`మెల్ల‌గా ఏదోలా బ‌తికేయ‌డానికి రాలేదు. ముంబాయిని ఉ* పోయించ‌డానికి వ‌చ్చాను!`` `బిజినెస్ మేన్` మూవీలో ప‌వ‌ర్ ప్యాక్డ్ డైలాగ్ ఇది. యాథృచ్ఛిక‌మో ఏమో కానీ ఇప్పుడు దేశం మొత్తం మ‌హ‌మ్మారీతో అల్ల‌క‌ల్లోలంగా ఉంటే పూరీ మాత్రం అదేదీ ప‌ట్ట‌న‌ట్టు ముంబైలో అడుగుపెట్టాడు. అస‌లే ముంబై- మ‌హారాష్ట్ర కొవిడ్ తో అత‌లాకుత‌లం అయ్యింది. ఇలాంటి టైమ్ లో పూరి అక్క‌డ ఎందుకు అడుగుపెట్టాడు? అంటే దానికి కార‌ణం కూడా అంతే పెద్ద‌దిగా ఉంద‌ని లీకులందాయి.

పూరి ముంబైకి వెళ్ల‌డం వెన‌క చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాట‌రే ఉంది. అత‌డు చాలా కాలంగా బాలీవుడ్ కండల హీరో స‌ల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్నాడు. స‌ల్మాన్ కూడా ఆస‌క్తిగానే ఉన్నాడు. కానీ ఇన్నాళ్లు ఎవ‌రికి వారు త‌లోదారిలో బిజీగా ఉండ‌డంతో ఆ ప్రాజెక్ట్ కుద‌ర‌లేదు. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ హీరోగా ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో రాధే తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటు దేవ‌ర‌కొండ హీరోగా పూరి ఫైట‌ర్ చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు. ఇవి పూర్తయ్యేప్ప‌టికి స‌ల్మాన్ ఖాన్ కాల్షీట్లు లాక్ చేయాల‌ని పూరి ప్లాన్ వేశాడ‌ట‌. అటు ప్ర‌భుదేవా సాయంతో అట్నుంచి న‌రుక్కొస్తున్నాడ‌ని తెలిసింది. పూరి కోస‌మే స‌ల్మాన్ ప్ర‌త్యేకించి ప‌న్వేల్ ఫామ్ హౌస్ వ‌దిలి ముంబైకి చేరుకున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

స‌ల్మాన్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రం `వాంటెడ్`  పూరి తెర‌కెక్కించిన `పోకిరీ`కి రీమేక్. అందుకే పూరి అంటే స‌ల్మాన్ కి ఎంతో గౌర‌వం. అప్ప‌టినుంచి క‌లిసి సినిమా చేయాల‌నుకున్నా ఇన్నాళ్లు కుదర‌లేదు. ఇక ఇప్పటికి కుదిరింది. ఆ ఇద్దరూ ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌ల్లో బిజీబిజీగా ఉన్నార‌ట‌. అస‌లే సౌత్ డైరెక్ట‌ర్ల‌ను డంప్ చేసుకుని సినిమాలు చేస్తున్న బాలీవుడ్ హీరోలంతా ఇలాంటి ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. ఇది పూరికి కూడా పెద్ద ప్ల‌స్ కానుంది. స్క్రిప్టు ఫైన‌ల్ అయిపోతే భాయ్ కాల్షీట్లు కేటాయించే వీలుంటుంద‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు కేజీఎఫ్ స్టార్ య‌ష్ తోనూ ఓ సినిమా చేసేందుకు పూరి గ‌ట్టిగానే స్కెచ్ వేశాడ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ పూరీకి స‌ల్మాన్ - య‌ష్ లాంటి హీరోలు వ‌ర్క‌వుటైతే వ‌రుస‌గా మూడు పాన్ ఇండియా సినిమాల్ని ఖాయం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా భారీ పాన్ ఇండియా చిత్రానికే పూరి శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్త‌య్యాక లాక్ డౌన్ ఇబ్బంది పెట్టింది. ఆ త‌ర్వాత య‌ష్ - స‌ల్మాన్ ల‌తోనూ కుదిరే వీలుంది.


Tags:    

Similar News