చిరు ఇంట్లో 'మా ఇంటి బంగారం'.. నందిని రెడ్డి డ్రీమ్ ఫుల్ ఫిల్!
ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే, ఇండస్ట్రీలో సీనియర్స్ ఆ టీమ్‌ను పిలిచి అభినందించడం ఎప్పటి నుంచో ఉన్నదే.
ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే, ఇండస్ట్రీలో సీనియర్స్ ఆ టీమ్‌ను పిలిచి అభినందించడం ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడు 'మా ఇంటి బంగారం' టీమ్ కు కూడా సరిగ్గా అలాంటి అరుదైన పిలుపే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ యూనిట్ ను స్వయంగా తన ఇంటికి ఇన్వైట్ చేసి ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా కూల్ గా జరిగిన ఈ మీట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోల్లో చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా ఉన్నారు. వాళ్లు మూవీ టీమ్ కు ఒక పెద్ద బొకే ఇచ్చి అభినందించారు. ఈ మీటింగ్ లో డైరెక్టర్ తో పాటు సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటించిన సమంత అలాగే మరికొందరు నటీనటులు ఉన్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి చాలా రిలాక్స్డ్ గా చిరు ఫ్యామిలీతో కాసేపు టైమ్ స్పెండ్ చేసినట్లు ఈ పిక్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
చిరంజీవి పక్కన నిలబడి దిగిన ఒక ఫోటోకు నందిని రెడ్డి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. చిన్ననాటి కలలు నిజమైన వేళ అంటూ ఆమె తన మనసులోని ఎమోషన్ ను అక్షరాల్లో బయటపెట్టారు. డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఏ ఫిల్మ్ మేకర్ కైనా తమ ఫేవరెట్ హీరో సినిమా చూసి పిలిపించుకుని మాట్లాడటం అంటే కచ్చితంగా ఒక లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ లాంటిదే. ఆ చిన్న పోస్ట్ లో ఆమె ఆనందం స్పష్టంగా కనిపించింది.
కంటెంట్ బాగుండి ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సినిమాలను ముందుండి అప్రిషియేట్ చేయడానికి చిరంజీవి ఎప్పుడూ రెడీగా ఉంటారు. గతంలో చాలా చిన్న సినిమాలకు ఆయన ఇలాగే ఇంట్లో పార్టీలు ఇచ్చి ఆ టీమ్స్ ను ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక 'మా ఇంటి బంగారం' విషయానికి వస్తే, ఇందులో సమంత స్క్రీన్ ప్రెజెన్స్ కు తోడు నందిని రెడ్డి మార్క్ ఫ్యామిలీ డ్రామాకు థియేటర్లలో ఆడియన్స్ నుంచి డీసెంట్ టాక్ వినిపిస్తోంది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాజిటివ్ బజ్ తెచ్చుకోవడం వల్లే సినిమా చిరు దాకా వెళ్లిందని చెప్పుకుంటున్నారు. ఈ మీటింగ్ లో నటీనటులు సమంత, సిద్ధు అప్పియరెన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. సమంత తన పర్సనల్ లైఫ్ లో ప్రెగ్నెన్సీ అనే ఒక బ్యూటిఫుల్ ఫేజ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయినా కూడా ఎలాంటి ప్రమోషనల్ హడావిడి లేకుండా చాలా క్యాజువల్ గా తన భర్తతో కలిసి ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ఇక మరోవైపు మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.