ఫాంటసీ పెరిగింది.. తెలుగు నేటివిటీ తగ్గిందా?

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మన ఊళ్లు, కల్చర్, ఫెస్టివల్స్, లోకల్ స్టోరీలు గుర్తుకొచ్చేవి.

Update: 2026-06-23 03:56 GMT

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మన ఊళ్లు, కల్చర్, ఫెస్టివల్స్, లోకల్ స్టోరీలు గుర్తుకొచ్చేవి. విలేజ్ బ్యాక్ డ్రాప్, లోకల్ కల్చర్, తెలుగు నేలతో ముడిపడిన స్టోరీలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ఒకసారి దృష్టి పెడితే ఆ చర్చ మరింత బలపడుతోంది.

ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలన్నీ ఎక్కువగా పాన్ ఇండియా, గ్లోబల్ మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్నాయి. మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌ లో వస్తున్న వారణాసి, అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్ రాకా, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ డ్రాగన్, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ వంటి చిత్రాల్లో ఫాంటసీ, ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్స్, ఓవర్సీస్ క్యాస్టింగ్ నటించడం మెయిన్ అట్రాక్షన్స్ గా కనిపిస్తున్నాయి.

ఆ సినిమాల కథలు కూడా ఒక్క ఏరియాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఒక ప్రశ్న వినిపిస్తోంది. తెలుగు స్టార్ హీరోలు, డైరెక్టర్స్ ఎందుకు కంప్లీట్ తెలుగు నేటివిటీతో కూడిన కథల వైపు అడుగులు వేయడం లేదనేది. కర్ణాటకలో వచ్చిన కాంతార లాంటి కథలు అక్కడి కల్చర్ ను ప్రపంచానికి పరిచయం చేశాయి.

బాలీవుడ్‌ లో స్త్రీ 2 వంటి సినిమాలు లోకల్ ఫోక్ స్టోరీస్ ఆధారంగా తీసుకుని భారీ విజయాలు సాధించాయి. మరి టాలీవుడ్ లో అలాంటి ప్రయత్నాలు ఎందుకు తగ్గిపోయాయన్న చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్ పెరగడంతో సినిమాల బడ్జెట్లు కూడా భారీ స్థాయికి చేరుకున్నాయి. ఇన్వెస్ట్మెంట్లు పెరిగిన కొద్దీ నిర్మాతలు పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షించే అంశాలపైనే దృష్టి పెడుతున్నారు.

అందుకే ఫాంటసీ, యాక్షన్ స్టోరీలు, ఇంటర్నేషనల్ క్యాస్టింగ్ సెలెక్షన్ వంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో నేటివిటీ కంటే గ్లోబల్ మార్కెట్ కు ఇంపార్టెన్స్ పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే నేటివిటీ ఉన్న కథలకు ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయిందని మాత్రం చెప్పలేం. గతంలో తెలుగు కల్చర్, జానపద కథలు, లోకల్ బ్యాక్ డ్రాప్స్ తో వచ్చిన అనేక చిత్రాలు విజయాలు అందుకున్నాయి.

ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నప్పటికీ, తమ నేటివిటీ స్టోరీస్ కూడా ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే భారీ కాన్వాస్‌ తో పాటు లోకాలిటీని కలిపి చూపించే ప్రయత్నాలు అవసరమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో పురాణాలు, ఫోక్ స్టోరీలు, లోకల్ డివోషనల్ కథలు, పీరియాడిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని రూపొందించే చిత్రాలకు కూడా జాతీయ స్థాయిలో ఆదరణ లభించే అవకాశం ఉందని పలువురు సినీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.

కేవలం ఫారిన్ బ్యాక్ డ్రాప్స్ లేదా వరల్డ్ రేంజ్ కథలే కాకుండా, తెలుగు నేటివిటీ కథలను కూడా అంతే గ్రాండ్ గా చెప్పవచ్చని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వరల్డ్ మార్కెట్‌ ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నప్పటికీ, అదే సమయంలో తెలుగు నేటివిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫాంటసీ, గ్లోబల్ కథలతో పాటు నేటివిటీ సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News