సమంత లైఫ్‌లో మరో హ్యాపీ మూమెంట్.. అందుకేనా బిగ్ గ్యాప్

మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సమంతకు పర్సనల్ లైఫ్‌లోనూ ఒక బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ వచ్చేసింది.

Update: 2026-06-23 03:55 GMT

మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సమంతకు పర్సనల్ లైఫ్‌లోనూ ఒక బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలు నిజమేనని తేలిపోయింది. ఇటీవల జరిగిన మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత కనిపించిన తీరుతోనే అభిమానుల్లో డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఈవెంట్‌లో ఆమె చాలా సింపుల్‌గా జీన్స్, లైట్ బ్లూ టీషర్ట్ వేసుకొని అటెండ్ అయినప్పటికీ, క్లియర్ గా కనిపిస్తున్న బేబీ బంప్‌ను నెటిజన్లు పక్కాగా గుర్తుపట్టేశారు.

దాంతో ఈ టాపిక్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఈ రూమర్స్‌కు ఎట్టకేలకు చెక్ పెడుతూ ఆ సినిమా డైరెక్టర్ బివి నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో అసలు విషయం ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. సమంత ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తూ.. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన శుభ సమయంలోనే ఈ పర్సనల్ మైల్ స్టోన్ కూడా రివీల్ అవ్వడం తమ టీమ్ మొత్తానికి డబుల్ హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పారు.

దీంతో నిన్నమొన్నటిదాకా నడిచిన గాలివార్తలన్నింటికీ ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఈ సక్సెస్ మీట్‌లో సమంత భర్త, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు కూడా ఆమె పట్ల చూపించిన కేరింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈవెంట్‌కు జనాలు భారీగా రావడంతో సమంతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రొటెక్టివ్‌గా చూసుకుంటూ క్రౌడ్‌లో నుంచి నడిపించారు. వీళ్లిద్దరి మ్యారేజ్ గత ఏడాది 2025 డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈశా యోగా సెంటర్ లో అత్యంత ఆత్మీయుల మధ్య చాలా ప్రైవేట్‌గా జరిగింది.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' లాంటి వెబ్ సిరీస్ కోసం కలిసి వర్క్ చేసిన ఈ జోడీ, ఇప్పుడు రియల్ లైఫ్‌లో పేరెంట్‌హుడ్‌కు వెల్కమ్ చెప్పేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 2026లో డెలివరీ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అందుకే ఈ అపురూపమైన సమయాన్ని ఫ్యామిలీతో కంప్లీట్‌గా ఎంజాయ్ చేయడం కోసం సమంత తన కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయిందట.

రాబోయే రోజుల్లో షూటింగ్స్ ఏవీ పెట్టుకోకుండా ఒక లాంగ్ బ్రేక్ ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్న్సమంత కపుల్ ఈ గుడ్ న్యూస్‌ను ఇంకా తమ పర్సనల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్ చేయనప్పటికీ, డైరెక్టర్ నందిని రెడ్డి ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అటు కెరీర్ పరంగా సినిమా సక్సెస్ కావడం, ఇటు లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుండటంతో సోషల్ మీడియాలో సమంతకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సామ్ ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News